Home Film News Ileana: ప్రెగ్నెన్సీ త‌ర్వాత తొలిసారి ఫ్యాన్స్‌తో ముచ్చ‌టించిన ఇలియానా..ఏమేం చెప్పిందంటే..!
Film News

Ileana: ప్రెగ్నెన్సీ త‌ర్వాత తొలిసారి ఫ్యాన్స్‌తో ముచ్చ‌టించిన ఇలియానా..ఏమేం చెప్పిందంటే..!

Ileana: గోవా బ్యూటీ ఇలియానా ఒక‌ప్పుడు టాలీవుడ్‌ని ఏ రేంజ్‌లో ఊపేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పోకిరీ, దేవదాసు, జల్సా లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో క‌థానాయిక‌గా న‌టించిన ఈ అమ్మ‌డు  దాదాపు 15 సంవత్సరాలకు పైగా తెలుగు, హిందీ భాషలలో తన సత్తాను చాటింది. కెరీర్ సాఫీగా సాగుతున్న స‌మ‌యంలో బాలీవుడ్‌కి వెళ్లి చేతులు కాల్చుకుంది. ప్ర‌స్తుతం అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో ఇలియానా అమ్మతనాన్ని అనుభవించడానికి రెడీ అయింది. తాను ప్ర‌గ్నెంట్ అయిన‌ట్టు కొద్ది రోజుల క్రితం ప్ర‌క‌టించింది. గ‌ర్భంతో ఉన్న ఫోటోల‌ని ఇలియానా సోషల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్‌ని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. ప్ర‌గ్నెన్సీ వ‌చ్చింద‌ని చెబుతుందే త‌ప్ప ఆమె క‌డుపులో బిడ్డ‌కు తండ్రి ఎవ‌ర‌నే దానిపై మాత్రం ఇలియానా క్లారిటీ ఇవ్వ‌డం లేదు.

కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి షేడ్స్ తో ఉన్న ఫోటోలని షేర్ చేసి తానే త‌న బిడ్డ‌కు తండ్రి అని చెప్పింది కాని, అత‌డు ఎవ‌ర‌నేది మాత్రం చెప్ప‌లేదు.  అయితే ప్ర‌గ్నెన్సీ త‌ర్వాత ఇలియానా తొలిసారిగా సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో ముచ్చ‌టించింది. వారు అడిగిన అనేక ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చింది.ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో బరువు పెరగడంతో ఆందోళన చెందుతున్నారా? అని ఓ నెటిజ‌న్స్ ప్ర‌శ్నించ‌గా, దానికి స‌మాధానం ఇచ్చిన ఇల్లీ బేబి ఆ ఆలోచన మైండ్‌లో పెట్టుకోవద్దని, నచ్చిన ఫుడ్‌ తింటూ సంతోషంగా ఉండాలని చెప్పుకొచ్చింది.

డాక్టర్‌ చెకప్ కి వెళ్లిన  ప్ర‌తీసారా వారు ప్రతిసారి బరువు చెక్‌ చేస్తారు, అది మనలో కొంత‌ ఆందోళన కలిగిస్తుందని చెప్పింది ఇలియానా. ప్ర‌గ్నెన్సీ జ‌ర్నీ బాగుంది, ఇది ఒక గొప్ప ఫీలింగ్. దీనిని వ‌ర్ణించ‌డానికి మాట‌లు స‌రిపోవంటూ ఇలియానా కామెంట్ చేసింది. ప్రెగ్నెన్సీ త‌ర్వాత‌ కొన్ని నెలల్లో నేను చాలా మారిపోయాను.కానీ ప్రెగ్నెన్సీని ప్రేమించడం వల్ల అది పెద్ద సమస్యగా అనిపించడం లేదని చెప్పుకొచ‌చ్చింది. తల్లులు ఎవ‌రైన కూడా సంతోషంగా, ఆరోగ్యంగా ఉండటంపై దృష్టిపెట్టాలని, బరువు పెరగడం అనే భావన మైండ్‌ లోనుంచి తీసేయాలని సూచ‌న చేసింది ఇలియానా. ఈ అమ్మ‌డు సూచ‌న‌లు ఇప్పుడు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...