Home Film News Rashmika Mandanna: మేనేజ‌ర్ చేతిలో నిండా మునిగిన ర‌ష్మిక‌.. అంత గుడ్డిగా ఎలా న‌మ్మింది..!
Film News

Rashmika Mandanna: మేనేజ‌ర్ చేతిలో నిండా మునిగిన ర‌ష్మిక‌.. అంత గుడ్డిగా ఎలా న‌మ్మింది..!

Rashmika Mandanna: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో ర‌చ్చ చేస్తుంది. వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కులని అల‌రిస్తూనే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో త‌న అందాల‌తో ర‌చ్చ చేస్తుంటుంది. ఇటీవ‌ల ర‌ష్మిక అందాల జాత‌రకి అడ్డు అదుపు లేకుండా పోయింది. కేక పెట్టించే అందాల‌తో కుర్ర‌కారుని మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది. ద‌క్షిణాదిన త‌న‌దైన మార్క్ క్రియేట్ చేసుకున్న ర‌ష్మిక మంద‌న్న ఇప్పుడు బాలీవుడ్‌లో పాగా వేయ‌టానికి త‌న వంతు ప్ర‌య‌త్నాలు అయితే చేస్తోంది. ఇప్ప‌టికే ఈ అమ్మ‌డు గుడ్ బై, మిష‌న్ మ‌జ్ను చిత్రాల్లో న‌టించ‌గా, ఈ రెండు సినిమాలు కూడా పెద్ద‌గా అల‌రించ‌లేదు. ప్ర‌స్తుతం ఆమె రెండు హిందీ సినిమాలు చేస్తుంది.

ర‌ణ్‌భీర్ క‌పూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శ‌క‌త్వంలో యానిమ‌ల్ అనే చిత్రం రూపొందుతుండ‌గా, ఈ సినిమా ఆగ‌స్ట్ 11న రిలీజ్ కాబోతుంది. ఈ మూవీపై భారీ హోప్స్ పెట్టుకుంది ర‌ష్మిక‌. ఇక ఈ అమ్మ‌డు న‌టిస్తున్న మ‌రో చిత్రం పుష్ప 2 పాన్ ఇండియా మూవీ కాబ‌ట్టి ఎంటైర్ ఇండియా లెవ‌ల్లో ర‌ష్మిక‌కు క్రేజ్ తెచ్చి పెడుతుందని భావిస్తుంది. అయితే ఈ అమ్మ‌డు త‌న మేనేజ‌ర్ చేతిలో మోస‌పోవ‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తన కెరీర్ తొలినాళ్ల నుంచి ఉన్న మేనేజర్ రూ.80 లక్షల మేర మోసం చేశాడ‌ని, ఈ విష‌యం గ్ర‌హించిన ర‌ష్మిక అతడిని తొలిగించింద‌ట‌.

 

అయితే ఈ విష‌యాన్ని పెద్ద‌గా చేయ‌డం ర‌ష్మిక మంద‌న్న‌కు ఏ మాత్రం ఇష్టం లేదు. అందుకోస‌మ‌నే ఎలాంటి కంప్లైంట్ లాంటివి ఇవ్వ‌లేద‌ని, అస‌లు బ‌య‌ట‌కు కూడా తెలియ‌నివ్వ‌లేద‌ని అంటున్నారు. అయితే ఈ న్యూస్ మాత్రం బయ‌ట‌కు ఎలా వ‌చ్చిందో కాని ప్ర‌స్తుతం తెగ వైర‌ల్ గా మారింది. అయితే అంత పెద్ద మొత్తంలో ర‌ష్మిక మోసపోవ‌డం నిజంగా ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని, ఎలాగైన అత‌ని నుండి రాబ‌ట్టే ప్ర‌య‌త్నం అయితే చేస్త‌ద‌ని కొంద‌రు నెట్టిజ‌న్స్ చెప్పుకొస్తున్నారు. కాగా, క‌న్న‌డ చిత్రం కిరిక్ పార్టీతో కెరీర్ స్టార్ట్ చేసిన ర‌ష్మిక మంద‌న్న .. మ‌హేష్ బాబు, అల్లు అర్జున్‌, నితిన్ వంటి స్టార్స్‌తో న‌టించి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు అందుకుంది.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...