Home Film News Sivaji: శివాజీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. చిరంజీవి, ఎన్టీఆర్‌ల నుండి నన్ను దూరం చేసింది వారే..!
Film News

Sivaji: శివాజీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. చిరంజీవి, ఎన్టీఆర్‌ల నుండి నన్ను దూరం చేసింది వారే..!

Sivaji: ఒక‌ప్పుడు ఓ వెలుగు వెలిగిన చాలా మంది స్టార్స్ ఇప్పుడు పూర్తిగా ఇండ‌స్ట్రీకి దూర‌మ‌య్యారు. అలాంటి వారిలో శివాజీ ఒక‌రు. హీరోగా ప‌లు సినిమాలు చేశాక ఆ త‌ర్వాత అవ‌కాశాలు త‌గ్గడంతో స‌పోర్టింగ్ రోల్‌లో, విల‌న్‌గాను క‌నిపించి మెప్పించారు. అన‌త‌రం ఆయ‌న  రాజకీయాల వైపు, సామాజిక కార్యక్రమాలపై ఎక్కువ దృష్టి సారించారు. అయితే ఎల‌క్ష‌న్స్ ముందు శివాజీ ప‌లు స‌ర్వేలు చేయ‌డం, వాటిపై డిబెట్స్ పెట్ట‌డం వంటి వాటితో కూడా మ‌నోడు ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలిచేవారు. తాజాగా శివాజీ ఓ ఇంట‌ర్వ్యూలో ప‌లువురు  టాలీవుడ్‌ స్టార్స్ పై, ప్రముఖ సీనియర్‌ ఆర్టిస్టులపై సంచలన వ్యాఖ్యలు చేసి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు.

ఆ మ‌ధ్య త‌న‌కు జ‌రిగిన అవ‌మానం గురించి చెబుతూ..ఇండ‌స్ట్రీలో ఓ పెద్ద మ‌నిషి తండ్రి చ‌నిపోయిన బాధ‌లో ఉంటే వారిని ఓదార్చ‌డం కోసం హ‌గ్ చేసుకోవాల‌నుకున్నా. కాని నా రెండు చేతులు ప‌క్క‌కి తీసేసాడు. ఓహో.. వారిని ట‌చ్ చేయాలంటే హోదా ఉండాలేమో అని అనుకున్నాను. అత‌ను దేవుడు,  ఆధ్యాత్మిక సమావేశాలలో  ఎక్కువ పాల్గొంటారు.కాని అత‌ను మాత్రం జీవితం చాలా చిన్న‌ది ఇవ‌న్ని ఎందుకు అనే విష‌యాలు గ్ర‌హించ‌రు అని శివాజీ అన్నాడు.

ఇక మ‌రో పెద్ద ఆర్టిస్ట్ ఓర్వ‌లేని త‌నంతో త‌న‌కు రావ‌ల్సిన ఎక్కువ రెమ్యున‌రేష‌న్‌ని తగ్గించేలా చేశాడ‌ని చెప్పాడు.త‌న కెరీర్ వేగంగా గ్రోత్ కావ‌డంతో అది అత‌ను త‌ట్టుకోలేక‌పోయాడు. చిరంజీవి, త‌న‌కు మ‌ధ్య దూరం పెంచింది కూడా అత‌నే అని శివాజీ స్ప‌ష్టం చేశాడు. ఆ పెద్ద ఆర్టిస్ట్ తన గురించి లేనిపోని విషయాలను చిరంజీవి వద్ద చెప్పి, తనని బ్యాడ్‌గా క్రియేట్‌ చేసి వారి నుండి దూరం చేశాడ‌ని అన్నాడు. ఇక ఎన్టీఆర్‌కి త‌న‌కు మ‌ధ్య కూడా ఓ పెద్ద ఆర్టిస్ట్ వ‌ల‌నే దూరం పెరిగింద‌ని అన్నాడు. అక్క‌డి విష‌యాలు ఇక్క‌డి విష‌యాలు చెప్పి గ్యాప్ పెరిగేలా చేశాడు.  ఒక‌ప్పుడు ఓ బ్యాచ్  చాడీలు చెబుతూ విభేదాలు క్రియేట్‌ చేసేవారని, ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి ఇండ‌స్ట్రీలో లేద‌ని శివాజీ తెలియ‌జేశారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...