Home Film News Salaar Team: అభిమానుల‌కి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన స‌లార్ టీం..ఆ ప‌ని చేస్తే ల‌క్ మీదే..!
Film News

Salaar Team: అభిమానుల‌కి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన స‌లార్ టీం..ఆ ప‌ని చేస్తే ల‌క్ మీదే..!

Salaar Team: యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ నుండి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. ఇప్ప‌టికే ఆయ‌న ఖాతాలో అర‌డ‌జ‌ను సినిమాలు ఉన్నాయి. ఆరు నెల‌ల గ్యాప్‌తో చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఇక ప్ర‌భాస్ న‌టించిన చివ‌రి చిత్రం ఆదిపురుష్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర చాలా నిరాశ‌ని మిగిల్చింది. మూవీపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. సాహో, రాధే శ్యామ్ ఫ్లాపుల త‌ర్వాత  వ‌చ్చిన ఆదిపురుష్ అయిన అభిమానుల‌ని అల‌రిస్తుంది అనుకుంటే అది కూడా నిరాశ‌ప‌ర‌చింది. దీంతో ఇప్పుడు ప్ర‌భాస్ తప్ప‌క హిట్ కొట్టాల్సిన ప‌రిస్థితి. మ‌రి కొద్ది రోజుల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న స‌లార్‌పైనే ఆశ‌లు పెట్టుకున్నారు అభిమానులు. ఇక ఈ మూవీ రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచారు మేక‌ర్స్.

ఆదిపురుష్‌తో నీర‌సంగా ఉన్న ప్ర‌భాస్ అభిమానుల‌ని ఉత్సాహ‌ప‌రిచేందుకు స‌లార్ మేక‌ర్స్ మూవీ  టీజ‌ర్‌ను జూలై 6 ఉద‌యం 5 గంట‌ల 12 నిమిషాల‌కు విడుద‌ల చేస్తున్నట్లు ప్రక‌టించారు. దీంతో ఈ మూవీ ఇప్పుడు ట్రెండింగ్‌లో నిలిచింది. ఇక మూవీపై మ‌రింత క్రేజ్ పెంచ‌డానికి స‌లార్ టీం టాలెంట్ ఉన్న వారికి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది.  ఎవ‌రైన ‘సలార్’పై స్టన్నింగ్ డిజైన్లు, మతిపోగొట్టే వీడియో ఎడిట్‌లు చేసి త‌మ టాలెంట్‌ను నిరూపించుకోవాలని చెప్పుకొచ్చింది. ఈ డిజైన్లు, వీడియో ఎడిట్ల ద్వారా మోస్ట్ వయోలెంట్ మేన్ (ప్రభాస్) గురించి మరింత ఎక్కువ మందికి తెలిసేలా చేయాలని పేర్కొంది. ఈ పోటీలో మంచి టాలెంట్ చూపించిన వారిని  ‘సలార్’ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌ ద్వారా ప్రజలకు చూపిస్తామని పేర్కొంది.

దీంతో ప్ర‌తి ఒక్క‌రు కూడా త‌మ టాలెంట్ చూపించేందుకు రంగంలోకి దిగారు.  ఇక కేజీఎఫ్ సిరీస్ త‌ర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న‌ సినిమా ఇది.ఇందులో అత్యంత క్రూరమైన వ్యక్తిగా ప్రభాస్ ని చూపింబోతున్నారు ద‌ర్శ‌కుడు. స‌లార్ కూడా కె.జి.యఫ్ మాదిరిగానే డార్క్ థీమ్‌తో తెర‌కెక్క‌నుండ‌గా, సెప్టెంబర్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రంలో  పృథ్వీరాజ్ సుకుమార్‌, శ్రుతీ హాస‌న్‌, జ‌గ‌ప‌తి బాబు ఇత‌ర కీల‌క పాత్రల్లో క‌నిపించ‌నున్నారు

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...