Home Film News Pawan Kalyan: జీవితాల‌తో ఆడుకునే వాడు గురువా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని ఆ హీరోయిన్ అంత మాట‌ల‌నేసింది?
Film News

Pawan Kalyan: జీవితాల‌తో ఆడుకునే వాడు గురువా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని ఆ హీరోయిన్ అంత మాట‌ల‌నేసింది?

Pawan Kalyan: ప‌వ‌ర్ స్టార్ పవ‌న్ క‌ళ్యాణ్‌.. ఒక‌ప్పుడు బ‌య‌ట పెద్ద‌గా క‌నిపించే వారు, ఏ విష‌యాల‌పై కూడా పెద్ద‌గా స్పందించే వారు కాదు. కాని ఆయ‌న ఎప్పుడైతే రాజ‌కీయాల‌లోకి వ‌చ్చాడో అప్పటి నుండి ఆయ‌నపై మాట‌ల దాడులు సాగుతూనే ఉన్నాయి. అటు రాజ‌కీయ నాయ‌కులు, ఇటు సినిమా ప‌రిశ్ర‌మ‌కి చెందిన కొంరు ప్ర‌ముఖులు ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అయితే తాజాగా ఒక‌ప్ప‌టి హీరోయిన్ పూనమ్ కౌర్.. ప‌వన్ క‌ళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూ సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. ఇప్పుడు పూన‌మ్ కామెంట్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. పూనమ్ కౌర్ సంద‌ర్భం వ‌చ్చిన ప్ర‌తిసారి పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మీద త‌న అక్కసు వెళ్లగక్కుతూ ఉంటుంది. నేరుగా కాక‌పోయిన ఇన్‌డైరెక్ట్‌గా సీరియ‌స్ కామెంట్స్ చేస్తూనే ఉంటుంది.

 

తాజాగా బండ్ల గ‌ణేష్ ట్వీట్ విష‌యంలో ఈ అమ్మ‌డు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్య‌లు చేసింద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. గురు పౌర్ణ‌మి సంద‌ర్భంగా బండ్ల గ‌ణేష్ త‌న ట్వీట్‌లో.. పవన్ కళ్యాణ్ ని గురు అని సంబోధిస్తూ ఆయ‌న లక్ష్యం నెరవరాలన్నారు. ఇకపై ఆయన ఫేమ్, నేమ్ వాడుకొని ఏ విధంగా లబ్ధి పొందే ప్రయత్నం చేయను అని చెప్పారు. సీఎం కావాలన్న ఆయన ఆకాంక్ష నెరవేరుతుందన్న ఆశాభావం వ్యక్తం కూడా చేశాడు. అయితే పవన్ కళ్యాణ్ ని బండ్ల గణేష్ గురు అని పిలిచిన నేపథ్యంలో పూనమ్ కౌర్ త‌న సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర పోస్ట్ పెట్టింది..

 

అడ్డమైనవారంద‌రిని గురు అని పిలవకండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.. వేదికల మీద నీతులు చెప్పి జీవితాలతో ఆడుకునేవాడు గురువు ఎలా అవుతాడు. మ‌న‌కు దారి చూపించేవాడు గురు అవుతాడు. దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి, అని పూన‌మ్ కౌర్ కామెంట్ చేశారు. ఈ కామెంట్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించే ఆమె చేసింద‌ని కొంద‌రు నెటిజ‌న్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. కాగా, గతంలో ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ కూడా పూనమ్ కౌర్ జీవితాన్ని పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ నాశనం చేశారని సంచ‌ల‌న వ్యాఖ్‌య‌లు చేశారు.. నేను బయటపెట్టే ఈ నిజాలు ఆ అమ్మాయికి మంచే చేస్తాయంటూ ఓ ఛానల్ స్టూడియోలో కొన్ని అలిగేష‌న్స్ చేసిన విష‌యం తెలిసిందే.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...