Home Film News Punch Prasad: జ‌బ‌ర్ధ‌స్త్ ఫేమ్ పంచ్ ప్ర‌సాద్ రెండు కిడ్నీలు పాడు కావ‌డానికి కార‌ణం ఇదేనా?
Film News

Punch Prasad: జ‌బ‌ర్ధ‌స్త్ ఫేమ్ పంచ్ ప్ర‌సాద్ రెండు కిడ్నీలు పాడు కావ‌డానికి కార‌ణం ఇదేనా?

Punch Prasad: సాధార‌ణంగా మ‌న‌ల్ని న‌వ్వించే ఎంతో మంది క‌మెడీయ‌న్స్ జీవితాల‌లో ఎన్నో క‌ష్టాలు ఉంటాయి. కాని వాట‌న్నింటిని ప‌క్క‌న పెట్టి మ‌న‌ల్ని న‌వ్వించేందుకు ఎంత‌గానో కృషి చేస్తుంటారు. ఆ కోవ‌లోకే వ‌స్తారు జ‌బ‌ర్ధ‌స్త్ ఫేమ్ పంచ్ ప్ర‌సాద్. కొంత కాలంగా మ‌నోడు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్నాడు. అయితే రోజు రోజుకి ఆయ‌న ఆరోగ్యం క్షీణిస్తుంది.  పంచ్ ప్రసాద్‌కి రెండు కిడ్నీలు చెడిపోయిన నేప‌థ్యంలో.. క్రమం తప్పకుండా డయాలసిస్ చేయాల్సిన ప‌రిస్థితి. రీసెంట్‌గా పంచ్ ప్ర‌సాద్‌ మల్టిపుల్ ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ కావడంతో ఆయ‌న‌ ఆరోగ్యం విషమించింది .ఇప్పటికే పంచ్ ప్రసాద్ వైద్యానికి దాదాపు రూ.50 లక్షలకు పైగానే ఖ‌ర్చు అయినట్టు తెలుస్తుంది.

అయితే ఇప్పుడు పంచ్ ప్ర‌సాద్‌కి ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్ధికసాయం సాయం అందించ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పంచ్ ప్రసాద్‌కి యశోద ఆసుపత్రిలో వైద్య సేవల్ని అందిస్తుండ‌గా, ఆయ‌నకి  సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్య ఖ‌ర్చులు అందించ‌నున్నారు. అయితే  సర్జరీ జరిగితే  ప్ర‌సాద్ పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని.. అయితే అది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ఆపరేషన్‌‌కి కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని ఆయ‌న స‌న్నిహితులు అంటున్నారు.అయితే ఇటీవల ఓ ఇంట‌ర్వ్యూలో త‌న రెండు కిడ్నీలు పాడ‌వ్వడానికి కార‌ణం చెప్పాడు ప్ర‌సాద్.

నాకు ముందు నుండి బీపీ ఉంది. అయితే ఈ వ‌య‌స్సులో నాకు బీపీ ఎందుకు వస్తుంది అనే భ్రమలో ఉండేవాడినని . స్కిట్ లు చేస్తున్న స‌మ‌యంలో కూడా  కోపం బాగా వ‌చ్చేది,  అప్పుడు స్కిట్ లలో ఉన్న‌ టెన్షన్ ల వల్ల అలా వస్తుంది అని అనుకునేవాడిని. ఒక్కోసారి ముక్కులో నుండి కూడా ర‌క్తం వ‌చ్చేది. దానిని లైట్ తీసుకున్నా. నా ఎంగేజ్‌మెంట్ త‌ర్వాత ఒక‌సారి ఇలానే ముక్కులో నుండి ర‌క్తం రావ‌డంతో నా భార్య భ‌య‌ప‌డి ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌గా అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ఆ త‌ర్వాత తన ఆరోగ్యం బాగా పాడైందని అన్నాడు ప్రసాద్. అయితే పెళ్లికి ముందే తనకు ఈ సమస్య ఉందని తెలిసినా కూడా సునీత తనను పెళ్లి చేసుకుందని, నా వ‌ల‌న చాలా బాధ‌ప‌డింద‌ని చెప్పుకొచ్చాడు

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...