Home Film News Varun Tej: ప్రేమ పుట్టిన చోటే పెళ్లి.. వరుణ్ తేజ్ భలే ప్లాన్ చేస్తున్నాడుగా..!
Film News

Varun Tej: ప్రేమ పుట్టిన చోటే పెళ్లి.. వరుణ్ తేజ్ భలే ప్లాన్ చేస్తున్నాడుగా..!

Varun Tej: ఇప్పుడు ఎక్క‌డ చూసిన కూడా వ‌రుణ్ తేజ్- లావ‌ణ్య త్రిపాఠిల ప్రేమ‌, పెళ్లి గురించే చ‌ర్చ‌.  ఎలాంటి లీక్ బ‌య‌ట‌కు రాకుండా సీక్రెట్‌గా ప్రేమాయ‌ణం న‌డిపిన ఈ జంట జూన్ 9న త‌న కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో నిశ్చితార్థం జ‌రుపుకున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి రామ్ చరణ్ దంపతులతో పాటు అల్లు అర్జున్, సాయి ధ‌ర‌మ్ తేజ్, వైష్ణ‌వ్ తేజ్, చిరంజీవి, అంజ‌నాదేవి ఇలా ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ఈ ఏడాది చివ‌రలో లావ‌ణ్య త్రిపాఠి- వైష్ణ‌వ్ తేజ్ ల వివాహం జ‌ర‌గ‌నుండ‌గా, పెళ్లికి సంబంధించిన వార్త ఒక‌టి ఇప్పుడు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు క‌లిసి  మిస్టర్, అంతరిక్షం  అనే చిత్రాల‌లో క‌లిసి న‌టించారు. అయితే  వీరిద్దరి ప్రేమకి బీజం పడింది మిస్టర్ సినిమా షూటింగ్ స‌మ‌యంలో. మిస్టర్ షూటింగ్ కోసం వ‌రుణ్ తేజ్- లావ‌ణ్య త్రిపాఠి ఇటలీ వెళ్ళినప్పుడు ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డట్లు స‌మాచారం. కెరీర్ లో బాగా స్థిరపడే వరకు తమ ప్రేమ వ్యవహారాన్ని బయటకు రానివ్వని ఈ జంట  రీసెంట్‌గా త‌న ఎంగేజ్‌మెంట్‌పై క్లారిటీ ఇచ్చారు. ఇక నిశ్చితార్థం పూర్తి కావ‌డంతో పెళ్లి ఎక్క‌డ చేసుకుంటార‌నే చ‌ర్చ న‌డుస్తుంది. మెగా ఫ్యామిలీ వరుణ్, లావణ్య వివాహాన్ని డెస్టినేషన్ వెడ్డింగ్ గా చేయాల‌ని అనుకుంటుందట‌.

వ‌రుణ్ తేజ్.. తమ ప్రేమ చిగురించిన ఇటలీలోనే పెళ్లి చేసుకోవాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. ఇటలీలో ఇప్ప‌టికే చాలా మంది పెళ్లిళ్లు చేసుకొని ఒక్క‌ట‌య్యారు. ఇప్పుడు వ‌రుణ్ తేజ్-లావ‌ణ్య‌లు కూడా ఇట‌లీలో డెస్టినేష‌న్ వెడ్డింగ్ జ‌రుపుకోవాల‌ని అనుకుంటున్నార‌ట‌. వరుణ్ తేజ్, లావణ్య లకి ఇటలీ లవ్ సెంటిమెంట్ గా ఉండ‌గా, పెళ్లి కూడా అక్క‌డే చేసుకోవ‌డం గొప్ప విష‌య‌మే అని చాలా మంది అంటున్నారు.  త్వరలోనే వరుణ్ లావణ్య వివాహానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా  ప్ర‌క‌టించ‌నున్నారు. లావ‌ణ్య త్రిపాఠి కెరీర్ ప్ర‌స్తుతం ఏమంత ఆశాజ‌న‌కంగా లేదు. దీంతో ఆమె పెళ్లి త‌ర్వాత సినిమాల‌కి గుడ్ బై చెప్ప‌బోతున్న‌ట్టు స‌మాచారం.

Related Articles

ఇప్పటికీ జక్కన్న నాకు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు.. తమన్నాసెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

మిల్కీ బ్యూటీ తమన్నా చిత్ర పరిశ్రమలో ఈ పేరుకి ఎలాంటి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో...

1000 కోట్లు ఇచ్చినా సరే అలా చేయను అంటూ తెగేసి చెప్పేస్తున్న ప్రభాస్.. ఎందుకో తెలుసా..!?

ప్రస్తుతం ఇండియన్ సినిమా చిత్ర పరిశ్రమలో భారీ స్టార్‌డంతో దూసుకుపోతున్న ప్రభాస్ పెళ్లి వయసు దాటుతున్న...

మహేష్ కోసం అవతార్ డైరెక్టర్ ను తీసుకొస్తున్న రాజమౌళి.. జక్కన్న స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా రాబోతున్నట్టు ఇప్పటికే అధికార...

రామ్ చరణ్ ఫోన్ లో ఎన్టీఆర్ నెంబర్ ఏమని ఉంటుందో తెలుసా.. భ‌లే సిల్లిగా లేదు..!

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా రామ్ చరణ్ టాలీవుడ్ లో అడుగుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా...