Home Film News Shruti Haasan: శృతి హాసన్ డ్ర‌గ్స్ తీసుకుంటుందా.. షాకింగ్ స‌మాధానం ఇచ్చిన క‌మ‌ల్ కూతురు
Film News

Shruti Haasan: శృతి హాసన్ డ్ర‌గ్స్ తీసుకుంటుందా.. షాకింగ్ స‌మాధానం ఇచ్చిన క‌మ‌ల్ కూతురు

Shruti Haasan: క‌మ‌ల్ హాసన్ గారాల ప‌ట్టి శృతి హాస‌న్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. గ‌బ్ట‌ర్ సింగ్ చిత్రంతో తొలి హిట్ అందుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ ఇక అక్క‌డి నుండి దూసుకుపోతూనే ఉంది. కెరీర్‌లో వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా పేరు ప్ర‌ఖ్యాత‌లు అందుకుంది. ఇక ప్రేమాయ‌ణం విష‌యంలో కూడా ఈ అమ్మ‌డు తెగ వార్త‌లలో నిలుస్తుంటుంది. గ‌తంలో  ఓ వ్య‌క్తితో ప్రేమ‌లో మునిగి తేలిన శృతి హాస‌న్ ఆ స‌మ‌యంలో సినిమాలు కూడా చేయ‌డం మానేసింది. అనుకోని ప‌రిస్థితుల వ‌ల‌న అత‌నితో విడిపోయిన శృతి హాస‌న్ తిరిగి సినిమాల‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. వ‌రుస హిట్స్ దక్కించుకుంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ స‌ర‌స‌న స‌లార్ అనే పాన్ ఇండియా చిత్రం చేస్తుంది.

మ‌రోవైపు కొత్త బాయ్ ఫ్రెండ్‌ని వెతుక్కున్న శృతి హాస‌న్ అత‌నితో సోష‌ల్ మీడియాలో తెగ ర‌చ్చ చేస్తుంటుంది. ఒక్కోసారి సోలోగా నెటిజ‌న్స్‌తో ముచ్చ‌టిస్తే మ‌రోసారి అత‌నితో క‌లిసి ఆన్‌లైన్ చాటింగ్‌కి వ‌స్తుంటుంది. తాజాగా శృతి హాస‌న్ సోష‌ల్ మీడియాలో నెటిజన్స్ తో కాసేపు ముచ్చ‌టించింది. ఓ నెటిజ‌న్.. మీకు మ‌ద్యం తాగే అల‌వాటు ఉందా, మ‌ద్యం తాగుతారా అని బోల్డ్‌గా ప్ర‌శ్నించారు. దానికి శృతి హాస‌న్ స్ట‌న్నింగ్ స‌మాధాన ఇచ్చింది.  నేను మద్యం తాగను. అలానే డ్రగ్స్ కూడా తీసుకోను. అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ నాకు లేవు. జీవితాన్ని హుందాగా, స‌ర‌దాగా గడపడం అంటేనే నాకు ఇష్టం అంటూ శృతి హాసన్ ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చింది.

శృతి హాస‌న్ స‌మాధానంపై నెటిజ‌న్స్‌తో పాటు ఆమె అభిమానులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. కాగా, శృతి హాస‌న్‌కి కెరీర్ మొద‌ట్లో ఎదురైన వ‌రుస‌ పరాజయాల కారణంగా ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. ఆ ముద్రని చెరిపివేస్తూ టాప్ హీరోయిన్ గా ఎద‌గ‌డానికి శృతికి ఎక్కువ టైం పట్టలేదు.  వరుస సినిమా ఆఫర్స్ తో పాటు  వరుసగా విజయాలు శృతికి ద‌క్క‌డంతో ఆమె సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.  బలుపు, ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు, క్రాక్, వాల్తేరు వీర‌య్య‌, వీర‌సింహారెడ్డి ఇలా ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌లో శృతి భాగ‌మైంది. ఇప్పుడు ఈ అమ్మ‌డు యంగ్ హీరోల‌కే కాక సీనియర్ హీరోల‌కి కూడా  లక్కీ హీరోయిన్ గా మారిపోయింది.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...