Home Film News Krish: రెండేళ్ల‌కే విడాకులు తీసుకున్న క్రిష్‌.. డైవ‌ర్స్‌కి ఆ హీరోయినే కార‌ణ‌మా?
Film News

Krish: రెండేళ్ల‌కే విడాకులు తీసుకున్న క్రిష్‌.. డైవ‌ర్స్‌కి ఆ హీరోయినే కార‌ణ‌మా?

Krish: ఇటీవ‌ల మనం సినీ ప‌రిశ్ర‌మ‌లో పెళ్లిళ్ల క‌న్నా విడాకుల గురించే ఎక్కువ వార్త‌లు వింటున్నాం. పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకి సైలెంట్‌గా విడిపోతుండ‌డంతో  వారు విడాకులుఎందుకు తీసుకున్నారు,కారణాలు ఏమై ఉంటాయి అని నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ వెతుకుతూ వ‌స్తున్నారు. అయితే టాలీవుడ్‌లో  ఒక్కసారిగా షాక్ అయ్యేలా చేసిన విడాకుల వ్యవహారం ఏది అంటే దర్శకుడు క్రిష్ తీసుకున్న విడాకులు అని చెప్పాలి.   క్రిష్త‌న  పెళ్లి సమయంలో ఒక రేంజ్ లో ఆయన అభిరుచులను తెలుపుతూ ఎంతో అద్భుతంగా పెళ్లి పత్రిక ను సిద్ధం చేశాడు. ఈ డైరెక్ట‌ర్ ఓ డాక్ట్‌ని పెళ్లి చేసుకొని రెండేళ్ల‌లోపే త‌న వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికాడు.

క్రిష్, ర‌మ్య‌లు 2016 ఆగ‌స్ట్ 7న పెళ్లి బంధంతో ఒక్కట‌య్యారు.  హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్  వేదిక‌గా  వీరి వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. వీరి పెళ్లికి టాలీవుడ్ మొత్తం క‌దిలి వ‌చ్చింది. ఈ జంట‌ని చూసిన ప్ర‌తి ఒక్క‌రు కూడా జంట చూడ‌ముచ్చ‌ట‌గా ఉంద‌ని అన్నారు. అయితే ఏమైందో ఏమో కాని  క్రిష్ కాపురంలో ఓ హీరోయిన్ వ‌ల‌న‌ చిచ్చు రేగింద‌ట‌. క్రిష్ డైరెక్ట్ చేసిన సినిమా వ‌ల‌న మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ అత‌నికి బాగా ద‌గ్గరి కావ‌డం, షూటింగ్స్ పేరుతో వీరిద్ద‌రు క‌లిసి బ‌య‌ట తిర‌గ‌డంతో  క్రిష్ నుంచి ర‌మ్య విడాకులు తీసుకుంది.

2018లో క్రిష్, రమ్యలకు కోర్టు విడాకులు మంజూరు చేయ‌డంతో వారిరివురు త‌మ వివాహ బంధానికి పులిస్టాప్ పెట్టారు. ఈ విష‌యం అప్ప‌ట్లో హాట్ టాపిక్ అయింది. ఇక ర‌మ్య నుండి విడాకులు తీసుకున్న త‌ర్వాత  క్రిష్ కెరీర్  అంత సాఫీగా ఏమీ సాగ‌టం లేదు. విడాకుల త‌ర్వాత క్రిష్‌..  బాల‌య్య మ‌హానాయ‌కుడు, క‌థానాయ‌కుడు అనే చిత్రాలు చేశాడు. మెగా హీరో వైష్ణ‌వ్ తేజ్‌తో కొండ‌పొలం తీశాడు. ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ డిజాస్ట‌ర్ అయ్యాయి. ఇక త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు అనే చిత్రం మూడేళ్ల క్రితం మొద‌లు పెట్టాడు. ఈ సినిమా షూటింగ్ ఇంకా న‌త్త‌న‌డ‌క‌నే సాగుతుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...