Home Film News మంచు మ‌నోజ్ మొద‌టి భార్య ప్ర‌ణ‌తి రెడ్డి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. డివోర్స్ త‌ర్వాత ప్ర‌ణ‌తి మ‌ళ్లీ పెళ్లి చేసుకుందా..?
Film NewsSpecial Looks

మంచు మ‌నోజ్ మొద‌టి భార్య ప్ర‌ణ‌తి రెడ్డి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. డివోర్స్ త‌ర్వాత ప్ర‌ణ‌తి మ‌ళ్లీ పెళ్లి చేసుకుందా..?

తెలుగు సినీ పరిశ్రమలో ఒకటికంటే ఎక్కువ వివాహాలు చేసుకున్న నటుల్లో మంచు మనోజ్ ఒకడు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, నిర్మల దేవి దంపతులకు జన్మించిన మనోజ్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్‌ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత హీరోగా మారాడు. 2004లో వ‌చ్చిన దొంగ – దొంగది మూవీతో క‌థానాయ‌కుడిగా అత‌ని ప్ర‌యాణం మొద‌లైంది. బిందాస్, వేదం, ఝుమ్మంది నాదం, క‌రెంట్ తీగ వంటి చిత్రాల‌తో మ‌నోజ్ టాలీవుడ్ లో హీరోగా నిల‌దొక్కుకున్నాడు. టాప్ స్టార్ గా ఎద‌గ‌లేక‌పోయినా.. ప్రేక్ష‌కుల్లో త‌న‌కంటూ ఒక ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. ప్రొఫెష‌న్ గురించి ప‌క్క‌న పెడితే.. మంచు మ‌నోజ్ మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన నాలుగేళ్ల తర్వాత శాసనసభ సభ్యులు భూమా నాగిరెడ్డి మరియు శోభ దంపతుల చిన్న కుమార్తె అయిన భూమా మౌనిక రెడ్డిని రెండో వివాహం చేసుకున్నాడు.

manchu manoj Archives - Page 7 of 9 - Telugu Journalist

భూమా మౌనిక రెడ్డి గురించి అందరికీ తెలిసిందే. మనోజ్ తో పాటు మౌనికకు కూడా ఇది రెండో వివాహమే కాగా.. ఆమె తన మొదటి భర్త గణేష్ రెడ్డి ద్వారా ఒక కుమారుడి కూడా జన్మనిచ్చింది. అయినప్పటికీ మౌనికను మనోజ్ ఇష్టపడ్డాడు. ఇద్దరి అభిప్రాయాలు అభిరుచులు కలవడంతో 2023లో వివాహం చేసుకున్నారు. మౌనిక కొడుకు ధైరవ్ రెడ్డిని మనోజ్ తన సొంత కుమారుడిలా స్వీకరించాడు. మౌనిక రెడ్డి త్వ‌రల‌నే మ‌రోసారి త‌ల్లి కాబోతోంది. మౌనిక రెడ్డి గురించి పక్కన పెడితే.. మంచు మనోజ్ మొదటి భార్య ప్రణతి రెడ్డి గురించి చాలా మందికి తెలియదు. అస‌లు ప్ర‌ణ‌తి రెడ్డి ఎక్క‌డ ఉంది..? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి..? మంచు విష్ణు స‌తీమ‌ణి విరానికాకి ప్ర‌ణ‌తి ఏం అవుతుంది..? ఆమెతో మ‌నోజ్‌ ల‌వ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది..? విడాకుల‌కు కార‌ణం ఏంటి..? డివోర్స్ త‌ర్వాత ప్ర‌ణ‌తి మ‌ళ్లీ పెళ్లి చేసుకుందా..? వంటి ఎన్నో విష‌య‌లు ఇక్క‌డ‌ తెలుసుకుందాం.

Manchu Manoj: 'నువ్వు నా కోసమే పుట్టావ్‌'.. భార్య మౌనికపై ప్రేమ కురిపించిన  మంచు మనోజ్‌.. వెడ్డింగ్‌ వీడియో వైరల్ - Telugu News | Hero Manchu Manoj  shares his wedding video ...

1983 జూలై 20 చెన్నైలో ప్ర‌ణ‌తి రెడ్డి జన్మించింది. ఆమె త‌ల్లిదండ్రులు వ్యాపారంగంలో రాణిస్తూ అమెరికాలో స్థిర‌ప‌డ్డారు. చిన్న‌త‌నం నుంచి చ‌దువుల్లో చాలా చురుగ్గా ఉండే ప్ర‌ణ‌తి.. చార్టర్డ్ అకౌంటెన్సీ చేసి అమెరికాలోనే మంచి ఉద్యోగాన్ని సంపాదించారు. అయితే మోహ‌న్ బాబు పెద్ద కోడులు, మంచు విష్ణు స‌తీమ‌ణి మ‌రియు స‌క్సెస్ ఫుల్ బిజినెస్ వుమెన్ విరానికా రెడ్డికి ప్ర‌ణ‌తి క్లాస్ మేట్‌. పైగా ఇద్ద‌రూ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. విరానికా ద్వారానే ప్ర‌ణ‌తి మంచు మ‌నోజ్‌కు ప‌రిచ‌యం అయింది. తొలి చూపులోనే ప్ర‌ణ‌తి ప్రేమ‌లో ప‌డ్డాడు మ‌నోజ్‌. ఆమెనే పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. ఇందులో భాగంగానే ఆమెను ఇంప్రెస్ చేస్తూ ప్ర‌ణ‌తి మ‌న‌సులో చోటు ద‌క్కించుకున్నాడు.

May be an image of 4 people, beard, people smiling and wedding

చాలా త‌క్కువ స‌మ‌యంలో ఇద్ద‌రూ క్లోజ్ అయ్యారు. వేరువేరు దేశాల్లో ఉన్నా కూడా ఎప్ప‌టిక‌ప్పుడు క‌లుసుకుంటూ రెండేళ్లు ప్రేమాయ‌ణం సాగించారు. ఆ త‌ర్వాత ఇరు కుటుంబ స‌భ్యుల‌ను ఒప్పించి 2015 మే 20 న హైదరాబాద్‌ హైటెక్స్‌లో మంచు మ‌నోజ్‌, ప్ర‌ణ‌తి వివాహం చేసుకున్నారు. అప్ప‌ట్లో వీరి పెళ్లి అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు.. పెద్ద పెద్ద వ్యాపార‌వేత్త‌లు వీరి వివాహంలో సంద‌డి చేశారు. అయితే పెళ్లి త‌ర్వాత వ‌రుస సినిమా అవ‌కాశాల‌తో మ‌నోజ్ కెరీర్ ప‌రంగా మ‌రింత బిజీగా అయ్యాడు. అలాగే చిన్న‌త‌నం నుంచి మ‌నోజ్‌కు అంద‌రితో క‌లిసి మెలిసి ఉండ‌టం, పార్టీల‌కు వెళ్లి ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయ‌డం, ఫ్రీడ‌మ్ గా ఉండ‌టం అంటే బాగా ఇష్టం. అవే ఆయ‌న అల‌వాటు చేసుకున్నారు.

మొదటి భార్యతో విడాకులపై స్పందించిన మనోజ్... ఏమన్నారంటే - Manchu Manoj Opens  On Divorce With First Wife Pranathi Reddy

అయితే వివాహం అనంత‌రం మనోజ్ ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు షూటింగ్స్ చేసుకోవ‌డం.. ఆ త‌ర్వాత రిలాక్స్ కోసం ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయ‌డం చేసేవారు. ఈ క్ర‌మంలోనే మ‌నోజ్‌-ప్ర‌ణ‌తి మ‌ధ్య విభేదాలు స్టార్ట్ అయ్యాయి. మ‌నోజ్ సినిమాల్లో బిజీ అయ్యాడ‌నే విష‌యాన్ని ఓపిక‌తో ప్ర‌ణ‌తి అర్థం చేసుకోలేక‌పోయింది. అలాగే మ‌నోజ్ కూడా సినిమాల‌తో పాటు భార్యతో స‌మ‌యం గ‌డ‌పాల‌న్న విష‌యాన్ని గ్ర‌హించ‌లేక‌పోయాడు. దాంతో వివాహం అయిన కొన్నాళ్ల‌కే ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు స్టార్ట్ అయ్యాయి. నిజానికి వ్య‌క్తిగ‌తంగా ఒక‌రిపై మ‌రికొరికి ఎంతో ఇష్టం మ‌రియు గౌరవం ఉంది. కానీ, జంట‌గా ఇద్ద‌రికీ ఏమాత్రం సెట్ కాలేదు. ఎంత క‌లిసి ఉండాల‌ని ప్ర‌య‌త్నించినా వారి మ‌ధ్య తల్లెత్తిన అభిప్రాయ భేదాలు మ‌నోజ్‌-ప్ర‌ణిత‌ల‌ను దూరం చేస్తూ వ‌చ్చాయి. అందుకే క‌లిసి ఉంటూ బాధ‌ప‌డ‌టం కంటే విడిపోయి సంతోషంగా ఉండ‌మే మేల‌ని నిర్ణ‌యించుకున్నారు. 2019లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. డివోర్స్ అనంత‌రం ప్ర‌ణ‌తి రెడ్డి అమెరికాలో ఉన్న త‌న త‌ల్లిదండ్రుల వ‌ద్ద‌కు వెళ్లిపోయింది. అయితే మ‌నోజ్‌కు దూరం అయ్యాక ప్ర‌ణ‌తి కూడా రెండో వివాహం చేసుకుంద‌ని గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి. కానీ, ఆమె ఇంకా సింగిల్ గానే ఉంది. త‌న తండ్రి బిజినెస్‌లు చూసుకుంటూ ప్ర‌ణ‌తి లైఫ్ లీడ్ చేస్తోంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...