Home Film News Chiranjeevi: క్లింకారకి చిరంజీవి దంప‌తులు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవ‌డం ఖాయం..!
Film News

Chiranjeevi: క్లింకారకి చిరంజీవి దంప‌తులు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవ‌డం ఖాయం..!

Chiranjeevi: రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తుల‌కి జూన్ 20న చిన్నారి జ‌న్మించిన విష‌యం తెలిసిందే. జూన్ 30న చిన్నారికి క్లింకార అని నామ‌క‌ర‌ణం చేశారు. మెగా వారసురాలురాక‌తో ఇటు మెగా ఫ్యామిలీ.. అటు మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. ఇక చిరంజీవి సైతం త‌న మ‌న‌వరాలిది అదృష్ట జాత‌కం అని చెబుతూ చాలా సంతోషించారు. అయితే మెగా ప్రిన్సెస్ పుట్టిన‌ప్పటి నుండి ఆ చిన్నారికి సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉంటుంది. అయితే అంద‌రు సెల‌బ్రిటీల మాదిరిగానే రామ్‌చరణ్‌ దంపతులు కూడా క్లింకార ముఖాన్ని బయటకు చూపించడం లేదు.

బారసాల ఫొటోలతో పాటు కొన్ని ఇమేజెస్‌, వీడియోలను షేర్ చేసిన కూడా ఎక్క‌డ క్లింకార ఫేస్ క‌నిపించ‌లేదు. క్లింకార‌కి ఎవ‌రి పోలిక‌లు వ‌చ్చాయా అని అభిమానులు తెగ ఆరాలు తీస్తున్నారు. ఇటీవ‌ల సాయి ధ‌ర‌మ్ తేజ్.. క్లింకారకు త‌న తండ్రి పోలికలే వచ్చాయి. అచ్చం రామ్‌చరణ్‌ లాగే ఉంటుంది. కళ్లు మాత్రం చాలా బాగున్నాయి. అవి నాకు తెగ నచ్చేశాయి. అమ్మాయి తండ్రి పోలికలతో పుడితే అదృష్టమంటారు. క్లింకార విషయంలోనూ అదే జరిగింది అని సాయి ధ‌రమ్ తేజ్ అన్నాడు. అయితే క్లింకార పుట్టిన త‌ర్వాత చిన్నారికి ప‌లువురు ప‌లు ర‌కాల గిఫ్ట్ లు అందిస్తున్నారు. చిరంజీవి ఏం ఇచ్చాడా అనే ఆస‌క్తి అంద‌రిలో ఉండ‌గా, రీసెంట్‌గా ఉపాస‌న ఈ విష‌యాన్ని రివీల్ చేసింది.

 

చిన్నారి క్లింకార‌కి చిరంజీవి-సురేఖ దంపతులు ఆంజనేయ స్వామి రూపంలో ఉన్న బంగారు డాలర్స్ ను అందమైన డిజైన్ తో తయ్యారు చేయించి గిఫ్ట్‌గా ఇచ్చార‌ని ఉపాస‌న పేర్కొంది. చిరంజీవికి ఆంజ‌నేయ స్వామి అంటే అమిత‌మైన ప్రేమ‌. అందుకే త‌న మ‌న‌వ‌రాల‌కి కూడా ఇష్టదైవాన్నే ప్రతిరూపంగా గిప్ట్ ఇచ్చారు. ఇక ఉపాసన తల్లిదండ్రులు బంగారు ఊయలను గిఫ్ట్ ఇచ్చినట్లు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త ముఖేష్ అంబాని కూడా బంగారు ఊయ‌ల‌ని గిఫ్ట్‌గా ఇచ్చాడ‌ని ప్ర‌చారం సాగింది. కాని దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. అల్లు అర్జున్, జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో పాటు ఇండ‌స్ట్రీకి సంబంధించిన ప‌లువురు ప్ర‌ముఖులు కూడా కాస్ట్‌లీ గిఫ్ట్‌లు ఇచ్చార‌ని చెబుతున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...