Home Film News Heroine Remuneration: ఆ హీరోయిన్ కావాలంటే నిమిషానికి కోటి రూపాయ‌లా.. దిమ్మతిరిగే రెమ్యున‌రేష‌న్
Film News

Heroine Remuneration: ఆ హీరోయిన్ కావాలంటే నిమిషానికి కోటి రూపాయ‌లా.. దిమ్మతిరిగే రెమ్యున‌రేష‌న్

Heroine Remuneration: సాధార‌ణంగా ఏ హీరోయిన్ అయిన దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌ని అనుకుంటుంది. అందుకే వ‌చ్చిన అవ‌కాశాల‌ని వ‌దులుకోవ‌డానికి ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌డం లేదు. వారు భారీగా రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తూ అంద‌రు అవాక్క‌య్యేలా చేస్తున్నారు. ఒక‌ప్పుడు హీరోయిన్స్ ఐటెం సాంగ్ చేసేందుకు ఏ మాత్రం ఆస‌క్తి చూపేవారు కాదు. కాని ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ సైతం భారీ రెమ్యున‌రేష‌న్ అందుకుంటూ  ఐటెం సాంగ్స్‌లో న‌ర్తిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వ‌శి రౌతేలా నిమిషానికి కోటీ రూపాయ‌లు తీసుకుందంటూ ఇప్పుడు నెట్టింట వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇది విని ప్ర‌తి ఒక్క‌రు షాక్ అవుతున్నారు.

స్టార్ హీరోయిన్లు ఓ ఫుల్ మూవీ చేస్తే 2, 3 కోట్లు తీసుకుంటారు. అలాంటిది  ఈ ముద్దుగుమ్మ మాత్రం కేవలం ఒకే ఒక్క నిమిషానికి రూ. కోటి తీసుకుని అంద‌రిని ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది. . ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ కు చెందిన ఊర్వశి రౌతేలా 2013లో సింగ్ సాబ్ ది గ్రేట్ అనే సినిమాతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సనమ్ రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, పాగల్ పంతి, వర్జిన్ భానుప్రియ వంటి చిత్రాల్లో బోల్డ్ క్యారెక్టర్స్ చేసి అంద‌రి దృష్టి ఆక‌ర్షించింది. అప్పుడ‌ప్పుడు మ్యూజిక్ వీడియోలు కూడా చేస్తూ అల‌రిస్తుంటుంది.ఇటీవ‌ల ఊర్వ‌శి ఎక్కువ‌గా ఐటెం సాంగ్ చేస్తూ కోట్లు దండుకుంటుంది.

చిరంజీవి హీరోగా రూపొందిన  వాల్తేరు వీరయ్య సినిమాలో బాసు వేరీజ్ ది పార్టీ అంటూ చిందులేసిన ఈ భామ రూ. 2 కోట్లు వసూలు చేసినట్లు స‌మాచారం. వాల్తేరు వీర‌య్య‌లో ఊర్వ‌శి ప‌ర్‌ఫార్మెన్స్‌కి అంద‌రు ఫిదా అయ్యారు. అందుకే ఆమెకి తెలుగులో ఆఫ‌ర్స్ వెతుక్కుంటూ వ‌స్తున్నాయి. ఏజెంట్ సినిమాలో వైల్డ్ సాలా అంటూ స్టెప్పులు వేసిన అద‌ర‌గొట్టిన ఈ భామ  తాజాగా పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ బ్రో సినిమాలో కూడా ఓ స్పెషల్ సాంగ్ లో అద‌ర‌గొట్టింది. ఇందులో సితార మంజరిగా  బాలీవుడ్ హాట్ బ్యూటి ఊర్వశి రౌతేలా అద‌ర‌గొట్టింది. ఈ సాంగ్ కోసం నిమిషానికి కోటీ తీసుకున్న‌ట్టు ప్ర‌చారం న‌డుస్తుంది. ఇక స్కంద చిత్రంలో  3 నిమిషాలు కనిపించేందుకు ఏకంగా రూ. 3 కోట్లు డిమాండ్ చేసిందని అంటున్నారు. అమ్మ‌డి హ‌వా చూసి ప్ర‌తి ఒక్క‌రు షాకవుతున్నారు..

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...