Home Film News FAKE: నెట్టింట‌ చ‌క్క‌ర్లు కొడుతున్న ఫొటోల‌న్నీ ఫేక్.. త్వ‌ర‌లోనే మెగా ప్రిన్సెస్ పిక్స్ షేర్ చేస్తామ‌న్న చ‌ర‌ణ్
Film News

FAKE: నెట్టింట‌ చ‌క్క‌ర్లు కొడుతున్న ఫొటోల‌న్నీ ఫేక్.. త్వ‌ర‌లోనే మెగా ప్రిన్సెస్ పిక్స్ షేర్ చేస్తామ‌న్న చ‌ర‌ణ్

FAKE: మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. పెళ్లైన ప‌ద‌కొండేళ్ల త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ దంప‌తులు పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు  చాలా సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. త‌న భర్త రామ్ చరణ్‌తో పాటు తల్లి శోభన కామినేని, అత్తమ్మ సురేఖ కొణిదెలతో కలిసి సోమ‌వారం సాయంత్రం అపోలో ప్రో హెల్త్ ఆసుప‌త్రికి వెళ్లిన ఉపాస‌న జూన్ 20 తెల్ల‌వారుఝామున పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. అయితే ఆ మ‌ధ్య ఓ కార్య‌క్ర‌మంలో మెగాస్టార్.. జూలైలో చ‌ర‌ణ్‌, ఉపాస‌నల‌కు బిడ్డ పుట్టే అవ‌కాశం ఉంద‌ని చెప్పుకొచ్చారు. అయితే  వారింట నెల ముందుగానే సందడి వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఉపాస‌న డెలివ‌రీ టైం ద‌గ్గ‌ర ప‌డిన‌ప్ప‌టి నుండి రామ్ చరణ్ సినిమాల‌న్నింటికి బ్రేక్ ఇచ్చి ఇంటిప‌ట్టునే ఉన్నాడు.

ప్ర‌స్తుతం చెర్రీ.. స్టార్ ద‌ర్శ‌కుడు శంక‌ర్‌తో క‌లిసి గేమ్ చేంజ‌ర్ అనే భారీ సినిమా చేస్తున్న సంగ‌తి విదిత‌మే. జూలై నెల‌లో ఈ మూవీకి సంబంధించిన మేజ‌ర్ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు చిత్ర యూనిట్‌.  అయితే రామ్ చ‌ర‌ణ్ రిక్వెస్ట్ మేర‌కు షెడ్యూల్‌ను ఆగ‌స్ట్‌కి మార్చారు. మ‌రి కొద్ది రోజుల‌లో చ‌ర‌ణ్ తిరిగి షూటింగ్‌లో జాయిన్ కానున్నాడు. ఇక  ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాన్ని వ‌చ్చే ఏడాది విడుద‌ల చేయ‌బోతున్నారు.  పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో  రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు తెలుస్తుంది.ఇక ఆయ‌న స‌ర‌స‌న  కియారా అద్వాని క‌థానాయికగా న‌టిస్తుంది.

అయితే రామ్ చ‌ర‌ణ్ దంపతులు త‌ల్లిదండ్రులు అయిన‌ప్ప‌టి నుండి వారికి సంబంధించి అనేక వార్త‌లు నెట్టింట హల్‌చ‌ల్ చేస్తున్నాయి. వారికి పుట్టిన పాప ఈమె అంటూ పలు ఫొటోలు నెట్టింట వైర‌ల్ చేస్తున్నారు.ఈ క్రమంలో  మెగా ఫ్యామిలీ స్పందిస్తూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలన్నీ ఫేక్ అని తేల్చేసింది. వీలైనంత  త్వరలోనే రామ్ చరణ్‌, చిరంజీవి అధికారికంగా పాప‌ ఫొటోలు షేర్ చేస్తారని స్పష్టం చేసింది. దీంతో నెట్టింట వైరల్ అవుతున్న ఫేక్ ఫొటోలపై క్లారిటీ వచ్చేసింది.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...