Home Film News Anasuya: రాత్రంతా బాగా క‌ష్ట‌ప‌డి అల‌సిపోయిన అన‌సూయ‌.. ఎంత క‌ష్ట‌మోచ్చింది..!
Film News

Anasuya: రాత్రంతా బాగా క‌ష్ట‌ప‌డి అల‌సిపోయిన అన‌సూయ‌.. ఎంత క‌ష్ట‌మోచ్చింది..!

Anasuya: అందాల సుందరి అన‌సూయ సినిమాలు, వివాదాల‌తో నిత్యం వార్త‌ల‌లో నిలుస్తూ ఉండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. కొద్ది రోజుల క్రితం రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ గురించి స్ట‌న్నింగ్ కామెంట్స్ చేసిన అన‌సూయ ఆయ‌న అభిమానుల‌చేత చీవాట్లు తింది. అయితే వారు చేసే కామెంట్స్‌కి అన‌సూయ ఏ మాత్రం త‌గ్గ‌కుండా ధీటుగా బ‌దులిచ్చింది.అయితే మ‌న‌శ్శాంతి కోసం తాను ఇక వివాదాల‌కి దూరంగా ఉంటాన‌ని కూడా తెలియ‌జేసింది అనసూయ. ఈ అమ్మ‌డు న‌టించిన విమానం ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఈ సినిమా పెద్ద విజ‌యం సాధించ‌లేదు.

ఇక అన‌సూయ ప్ర‌స్తుతం త‌న  కొత్త ప్రాజెక్ట్ కోసం తెగ కష్టపడుతున్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా  తెలియ‌జేస్తూ.. ఫోటోలు, వీడియోలు కూడా షేర్ చేసింది.  అర్థరాత్రి మొదలైన షూటింగ్ తెల్లవారుజాము వరకు నాన్ స్టాప్ గా  సాగింద‌ని, ఈ క్ర‌మంలో తాను అల‌సిపోయాన‌ని కూడా షేర్ చేసింది. అయితే  త‌న‌కు ఇలాంటి  అరుదైన  పాత్రలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న చిత్ర‌ మేకర్స్, ఆడియన్స్ కి ధన్యవాదాలు చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం అన‌సూయ పోస్ట్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. యాంక‌రింగ్‌కి గుడ్ బై చెప్పిన అన‌సూయ ప్ర‌స్తుతం న‌టిగా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటుంది.

అన‌సూయ‌కి ఈ మ‌ధ్య ఛాలెంజింగ్ పాత్ర‌లు వ‌స్తున్నాయి. విమానం సినిమాలో వేశ్య పాత్ర‌లో న‌టించి మెప్పించింది. ఇక పుష్ప సినిమాలో దాక్షాయ‌ణి అనే పాత్ర‌లో అల‌రించింది. రీసెంట్‌గా కృష్ణ‌వంశీ తెరకెక్కించిన  రంగమార్తాండ మూవీలో కూడా కీలక రోల్ చేసింది అన‌సూయ‌. ప్ర‌స్తుతం  పుష్ప 2లో మరోసారి ఆమె దాక్షాయణిగా కనిపించి అల‌రించ‌నుంది. దర్శకుడు సుకుమార్ త్వరితగతిన ఈ క్రేజీ సీక్వెల్  పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు. ఈ ఏడాది చివ‌ర‌లో పుష్ప 2 చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే అన‌సూయ చేతిలో ఇప్పుడు చాలానే క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయ‌ట. వీటితో అమ్మ‌డికి మంచి గుర్తింపు వ‌స్తుంద‌ని అంటున్నారు. రీసెంట్‌గా అన‌సూయ బికినీలో కూడా తెగ సంద‌డి చేసింది. వైట్ క‌ల‌ర్ బికినీ వేసి కుర్రాళ్ల‌కి పిచ్చెక్కించింది. ఆమె పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేశాయి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...