Home Film News Varun Tej Lavanya: అట్ట‌హాసంగా వ‌రుణ్ తేజ్-లావ‌ణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్‌.. వేడుక‌కి ఎవ‌రెవ‌రు హాజ‌ర‌య్యారంటే..!
Film News

Varun Tej Lavanya: అట్ట‌హాసంగా వ‌రుణ్ తేజ్-లావ‌ణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్‌.. వేడుక‌కి ఎవ‌రెవ‌రు హాజ‌ర‌య్యారంటే..!

Varun Tej Lavanya: నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడు.  గత కొంతకాలంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ప్రేమ‌లో మునిగి తేలుతున్న‌వరుణ్.. ఎట్టకేలకు వైవాహిక‌ బంధంలోకి అడుగుపెడుతున్నారు. కొన్నాళ్లుగా వీరి వ్య‌వ‌హారంకి సంబంధించి అనేక వార్త‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ కొట్టి ప‌డేసారు. అయితే ఎట్ట‌కేల‌కు జూన్ 9 రాత్రి ఎనిమిది గంటలకు ఈ ఇద్దరికీ అత్యంత సన్నిహితుల మధ్య ఎంగేజ్‌మెంట్ జరిగింది. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ప్రైవేట్ కార్య‌క్ర‌మంగా జ‌రిగిన ఈ వేడుక‌కి మెగా, అల్లు ఫ్యామిలీ స‌భ్యులు మాత్ర‌మే హాజ‌రైన‌ట్టు తెలుస్తుంది.

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు అరవింద్, అంజనాదేవి, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్ తో పాటు ప‌లువురు స‌న్నిహితులు, శ్రేయోభిలాషులు కూడా హాజ‌ర‌య్యారు.ఇక వ‌రుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి త‌మ‌ నిశ్చితార్థ వేడుక కు సంబంధించి ఫోటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా, అవి నెట్టింట తెగ‌ హల్ చల్ చేస్తున్నాయి. ఇక పిక్స్  చూసినవారంతా కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగా అభిమానులు అయితే ఈ కొత్త  జంటను చూడ ముచ్చటైన జంటగా అభివర్ణిస్తున్నారు.  ఇక వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ సందర్భంగా సోషల్ మీడియాలో #VarunLav  అనే హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అయింది.

ఎంగేజ్‌మెంట్ వేడుక కొసం ప్రముఖ డిజైనర్స్ స్టైలిస్ట్స్  వరుణ్‌- లావణ్యల  ప్రత్యేక కాస్ట్యూమ్స్ స్టైలింగ్ పై వర్క్ చేశారట. వరుణ్ తేజ్ దుస్తుల్ని డిజైనర్ తరుణ్ తహిలియా రూపొందించగా.. లావణ్యకు అశ్విన్ మావ్లే  స్టైలింగ్ చేసిన‌ట్టు తెలుస్తుంది.. అలాగే.. డిజైనర్ అనితా డోంగ్రే లావణ్య స్పెషల్ లుక్ డిజైన్ చేశారని ఇన్‌సైడ్ టాక్.ఇక ఇదిలా ఉంటే లావ‌ణ్య త్రిపాఠి- వ‌రుణ్ తేజ్ ల‌ పెళ్లి ఈ ఏడాది చివర్లో జరగనున్నట్టు సమాచారం.  2017లో విడుదలైన మిస్టర్ సినిమా కోసం కలిసి ఈ ఇద్ద‌రు ప‌ని చేయగా, ఆ స‌మ‌యంలో స్నేహం ఏర్ప‌డి అది ప్రేమ‌గా మారింద‌ని అంటున్నారు. రానున్న రోజులలో అయిన‌ వారి ల‌వ్ ఎప్పుడు ఎలా పుట్టింద‌నేది చెబుతారో లేదా అనేది చూడాలి.

Related Articles

38 ఏళ్ల కెరీర్ లో విక్ట‌రీ వెంక‌టేష్ ఎన్ని సినిమాలను రిజెక్ట్ చేశారు.. అందులో హిట్లు ఎన్నో తెలుసా?

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అత్యధిక సక్సెస్ రేటు ఉన్న హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. అత్యధిక...

చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. అమీర్ ఖాన్ కూతురు మృతి..కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఫ్యాన్స్..!

చిత్ర పరిశ్రమను వరుస‌ విషాదాలు వెంటాడుతున్నాయి. అగ్ర సెలబ్రిటీలు మరణించారు అన్న విషాదం మరవకముందే మరొక...

వార్‌2 షూటింగ్ అండ్ క్రేజీ అప్డేట్… ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయిందిగా..!

టాలీవుడ్‌లో హీరోలుగా రాణించినప్పటికీ ప్రతి హీరోకి బాలీవుడ్‌లో కూడా తన సత్తా చూపించాలని ఉంటుంది. అలా...

చిరంజీవి VS పవన్.. ఎవ‌రు తగ్గట్లేదుగా..!

మెగాస్టార్ చిరంజీవి మ‌రియు ఆయన సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తెలుగులో ఉన్న...