Home Film News Sharwanand Reception: అట్ట‌హాసంగా శ‌ర్వానంద్ వెడ్డింగ్ రిసెప్ష‌న్‌.. ఈ వేడుక‌కి వ‌చ్చిన సెలబ్స్ ఎవ‌రంటే..!
Film News

Sharwanand Reception: అట్ట‌హాసంగా శ‌ర్వానంద్ వెడ్డింగ్ రిసెప్ష‌న్‌.. ఈ వేడుక‌కి వ‌చ్చిన సెలబ్స్ ఎవ‌రంటే..!

Sharwanand Reception: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్ ఇప్పుడు ఒక్కొక్క‌ళ్లుగా పెళ్లి పీట‌లెక్కుతున్నారు. ఈ క్రమంలోనే హ్యాండ్స‌మ్ హీరో శర్వానంద్  జూన్ 3వ తేదీన రక్షిత రెడ్డిని పెళ్లాడాడు. జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో గ్రాండ్‌గా వీరి వివాహం జ‌రిగింది. శర్వా-రక్షిత  వివాహం కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల మధ్య రెండు రోజుల పాటు అంగ‌రంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఇండ‌స్ట్రీ నుండి రామ్‌చరణ్, సిద్దార్థ్‌, అదితీరావు హైదరీ తదితరులు హాజరయ్యారు. పెళ్లికి ముందు ఈ జంటకి సంబంధించిన‌ హల్దీ, సంగీత్ వంటి ప్రీ-వెడ్డింగ్ వేడుకలు జ‌ర‌గ‌గా, వాటిని కూడా జైపూర్ లీలా ప్యాలెస్‌లోనే నిర్వహించారు.

శ‌ర్వానంద్- ర‌క్షిత ఈ ఏడాది జనవరి 26న ఎటువంటి ప్రకటన లేకుండా సడన్‌గా నిశ్చితార్ధం చేసుకొన్నారు. శర్వానంద్ బార్య అయిన ర‌క్షిత‌.. మాజీ మంత్రి అయిన టీడీపీ నేత స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి మనవరాలు. అంతేకాదు హైకోర్టు లాయర్ మధుసూధనా రెడ్డి కూతురు కూడా. వీరిది పెద్ద‌లు నిశ్చ‌యించిన వివాహం కాగా, ఈ జంట చూడ‌ముచ్చ‌టగా ఉంద‌ని అభిమానులు తెలియ‌జేస్తున్నారు. ఇక   గ‌త రాత్రి  శర్వానంద్, రక్షిత రెడ్డి రిసెప్షన్ వేడుక హైదరాబాద్ లో అట్ట‌హాసంగా జరిగింది. హీరో శర్వానంద్ తన రిసెప్షన్ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ని కూడా ఆహ్వానించిన విష‌యం తెలిసిందే.

రిసెప్ష‌న్ వేడుక‌లో  శర్వానంద్, రక్షిత జంట  చాలా చ‌క్క‌గా క‌నిపించారు. శర్వానంద్ వెస్ట్రన్ స్టైల్ లో వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ ధరించగా.. రక్షిత రెడ్డి పింక్ కలర్ డిజైనర్ శారీలో అద‌ర‌గొట్టింది. వీరి రిసెప్ష‌న్ వేడుక‌కి చాలా మంది హీరోలు స‌తీస‌మేతంగా ఆజ‌రై సంద‌డి చేశారు.  మంత్రి కేటీఆర్‌తో పాటు మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన కూడా హాజ‌ర‌య్యారు.  ఉపాసన నిండు గర్భిణి కావడంతో ఆమెని జాగ్రత్తగా చేయి పట్టుకుని చరణ్ న‌డిపిస్తున్న దృశ్యాలు నెట్టింట వైర‌ల్‌గా మ‌రాయి. ఇక యంగ్ హీరోలు నితిన్, నిఖిల్, అల్లరి నరేష్ వారి వారి సతీమణులతో వేడుక‌కి హాజ‌ర‌య్యారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, నందమూరి బాలకృష్ణ, అక్కినేని అమల, యంగ్ బ్యూటీ రీతూ వర్మ, జీవిత రాజశేఖర్ వారి కుమార్తెలు, రానా దగ్గుబాటి, మంచు లక్షి వంటి సెల‌బ్స్ రాక‌తో రిసెప్షన్ వేడుక‌ కనుల పండుగలా సాగింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...