Home Film News Producer Car: నిర్మాత కారు అద్దాలు ప‌గ‌ల‌గొట్టి చోరీ.. ఎంత దోచుకుపోయారంటే..!
Film News

Producer Car: నిర్మాత కారు అద్దాలు ప‌గ‌ల‌గొట్టి చోరీ.. ఎంత దోచుకుపోయారంటే..!

Producer Car: టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఒక‌ప్పుడు వైవిధ్య‌మైన సినిమాలు రూపొందించి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్నాడు బెల్లంకొండ సురేష్. ఆయ‌న ఇటీవ‌లి కాలంలో సినిమాలు త‌గ్గించి త‌న కుమారుల‌ని హీరోలుగా నిల‌బెట్టేందుకు చాలా కృషి చేస్తున్నాడు.  అయితే తాజాగా  బెల్లంకొండ సురేష్ కారులో చోరీ జరిగింది.  ఈ ఘ‌ట‌న గురువారం రోజు జ‌రిగినప్పటికీ విషయం  కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తులు కొంద‌రు కారు అద్దం పగలకొట్టి నగదుతో పాటు ఖరీదైన మద్యం సీసాలను దోచుకెళ్లార‌ట‌. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ప్ర‌స్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన జర్నలిస్ట్ కాలనీలో జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది.

బెల్లంకొండ సురేష్‌.. రీసంట్‌ఘా  జర్నలిస్ట్ కాలనీలోని సాయి గణేష్ ప్రొడక్షన్ పేరుతో ఉన్న కార్యాలయం వద్ద త‌న బెంజ్ కారు పార్క్ చేశారు. ఆ స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. గురువారం మ‌ధ్యాహ్నాం ఆయ‌న పార్క్ చేసిన ఆయ‌న‌  శుక్రవారం ఉదయం కారు వ‌ద్ద‌కు వెళ్లారు. కారు ద‌గ్గ‌ర‌కి వెళ్లి చూడ‌గా,  ఎడమవైపు వెనుక సీటు వద్ద ఉన్న‌ అద్దం పూర్తిగా పగిలి ఉంది.  అంతేకాదు అందులో  ఉంచిన   50వేల నగదు 11 ఖరీదైన మద్యం సీసాలు కూడా దొంగలించారట‌. ఒక్కొక్క మద్యం సీసా ఖరీదు 28వేల‌కి పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. నగదు, మద్యం సీసాలు చోరీకి గురైన విష‌యం తెలుసుకున్న‌ కార్యాలయం సిబ్బంది జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇక బెల్లంకొండ సురేష్ త‌న‌యుల విష‌యానికి వ‌స్తే పెద్దోడు.. అల్లుడు శీను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.  ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌తో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించాడు. ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహించ‌గా, ఈ మూవీ కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా ప‌డింది. ఇక యూత్ ఫుల్ హీరో బెల్లంకొండ గణేష్ తన కెరీర్ ఆరంభం మంచి కథలు ఎంపికలు చేసుకుంటూ వ‌స్తున్న‌ప్ప‌టికీ స‌క్సెస్ అంద‌డం లేదు. అతని రెండో సినిమా నేను స్టూడెంట్ సార్ రీసెంట్‌గా విడుద‌ల కాగా, ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర నిరాశ‌ప‌ర‌చింది. ఈ చిత్రానికి రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహించారు.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...