Home Film News Star Heroine: సోష‌ల్ మీడియాకి దూరంగా స్టార్ హీరోయిన్.. స‌డెన్‌గా ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డానికి కార‌ణం?
Film News

Star Heroine: సోష‌ల్ మీడియాకి దూరంగా స్టార్ హీరోయిన్.. స‌డెన్‌గా ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డానికి కార‌ణం?

Star Heroine: ఒక‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారుని తెగ ఊపేసిన స్టార్ హీరోయిన్ కాజోల్‌. షారూఖ్ ఖాన్‌తో పలు సూప‌ర్ హిట్ సినిమాల‌లో న‌టించి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకుంది.ఇప్పటికీ త‌న‌దైన శైలిలో భిన్న‌మైన సినిమాలు చేస్తూ వ‌స్తున్న కాజోల్ సోషల్ మీడియాలో కూడా  ఎప్పుడూ యాక్టివ్‍గా ఉంటూ ఫొటోలు, వీడియోలను ఫేర్ చేస్తూ అల‌రిస్తుంటుంది. తాజాగా ఆమె త‌న అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పారు. సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నానని ఇన్‍స్టాగ్రామ్, ట్విటర్‌లో పోస్ట్ చేసి షాక్ ఇచ్చారు. విచిత్ర‌మైన అర్ధం వ‌చ్చేలా కాజోల్ పోస్ట్ పెట్టింది.

నా జీవితంలో ఇప్పుడు కష్టతరమైన పరీక్షల్లో ఒకటి ఎదుర్కొంటున్నాను అని తెల‌పింది. అలానే  ఇక్కడ మ‌రో విషయం కూడా వుంది. కాజోల్ ఒక  వెబ్ సిరీస్ లో కూడా  నటించింది, దాని పేరు ‘ది ట్రయల్ కాగా,  అదే పేరు వచ్చేట్టు ఆ పోస్ట్ కూడా పెట్టింది. అయితే కాజోల్‌కి వ్యక్తిగతంగా ఏమైనా సమస్య వచ్చిందా, లేక పరిశ్రమ నుండి ఏదైనా సమస్య ఉత్ప‌న్న‌మైందా అనేది మాత్రం తెలియ‌రావ‌డం లేదు. కాగా కాజోల్ త‌న ఇన్‍స్టాగ్రామ్‍లో ఇది వరకు పోస్ట్ చేసిన ఫొటోలను, వీడియోలను కూడా డిలీట్ చేయ‌డం హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం  ఆమెకు ఇన్‍స్టాగ్రామ్ లో 1.45కోట్ల మందికి పైగానే ఫాలోవర్లు ఉన్నారు.

కాజోల్ ఇలా స‌డెన్‌గా ఇన్‌స్టా నుండి త‌ప్పుకోవ‌డంపై అంద‌రిలో అనేక అనుమానాలు త‌లెత్తుతున్నాయి.  “మీరు క్షేమంగానే ఉన్నారని మేము ఆశిస్తున్నాం. టైమ్ తీసుకోండి క్వీన్” అని ఓ యూజర్ త‌న‌ కామెంట్ లో తెలిపారు. “ఏ పరిస్థితుల్లోనైనా మా ప్రేమ మీతోనే ఉంటుంది” అని మరో యూజ‌ర్ రాసుకొచ్చారు. ఇక భర్త అజయ్ దేవ్‍గన్‍తో కాజోల్‍కు ఏమైనా గొడవ అయిందా అని కొంద‌రు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. కాజోల్ చివ‌రిగా ఇంటర్నేషనల్‍గా సూపర్ హిట్ అయిన గుడ్‍వైఫ్ సిరీస్ ఆధారంగా రూపొందించిన సలామ్ వెంకీలో క‌నిపించింది. ఇక ఆమె న‌టించిన  లస్ట్ స్టోరీస్ 2 జూన్ 29న  నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి అందుబాటులోకి రానుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...