Home Film News Jabardasth Comedian: జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడీయ‌న్ అంత పెద్ద కేసులో ఇరుక్కున్నాడా..!
Film News

Jabardasth Comedian: జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడీయ‌న్ అంత పెద్ద కేసులో ఇరుక్కున్నాడా..!

Jabardasth Comedian: బుల్లితెర కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్‌తో ఇండ‌స్ట్రీకి అనేక మంది క‌మెడీయ‌న్స్ ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. వీరిలో కొంద‌రు స‌న్మార్గంలో న‌డుచుకుంటూ వెళుతూ జీవితంలో ఉన్న‌త స్థానానికి చేరుకుంటున్నారు. మ‌రి కొంద‌రు మాత్రం త‌ప్పుడు దారిలో ప‌య‌నిస్తూ జీవితం నాశ‌నం చేసుకుంటున్నారు. తాజాగా జబర్దస్త్ కమెడియన్‌ హరి అలియాస్ హరితపై   ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసు నమోదు అయ్యింది. చంటి టీమ్‌లో లేడీ గెటప్‌లు వేసి క‌డుపుబ్బ న‌వ్వించే  హరిత తెర వెనుక గట్టుచప్పుడుకాకుండా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. తాజాగా చిత్తూరు జిల్లా పుంగనూరులో దాదాపు రూ.60 లక్షల విలువైన ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తూ కిషోర్ అనే వ్యక్తి పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు.

అయితే ఆ వ్య‌క్తిని పోలీసులు విచారించ‌గా,  అతను హరి పేరు చెప్పడంతో అసలు విషయం బయటపడింది. ఈ వ్యవహారంతో హరికి సంబంధం ఉందని అత‌ను చెప్పుకొచ్చాడు. అంతేకాదు సరుకును తరలించే ప్లాన్ కూడా అతడిదేనని పోలీసులకు తెలిపాడు. ఈ ఆపరేషన్‌లో హరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి పోలీసులు ట్రై చేసినప్పటికీ, వారి కళ్లుగప్పి పారిపోయినట్లు తెలుస్తుంది. ప్ర‌స్తుతం హరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న హరి కోసం  గాలింపు చర్యలు కూడా చేపట్టారు. ఇదిలా ఉంటే ఇప్పటికే కమెడియన్ హరిపై ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వేరు వేరు పోలీస్ స్టేషన్లో పలు కేసులు న‌మోద‌య్యాయి.

రెండేళ్ల క్రితం చిత్తూరు జిల్లా భాకరాపేట సమీపంలోని చీకిమానుకోన అటవీప్రాంతంలో ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ జ‌రుగుతుంద‌ని పోలీసుల‌కి స‌మాచారం అందింది. వెంట‌నే దాడులు చేసి  ఎనిమిది మంది దుండగులను అరెస్టు చేశారు. అయితే ఆ స‌మ‌యంలో కూడా పోలీసుల నుంచి జబర్దస్త్‌ హరి తప్పించుకున్నాడు. హరికి పలువురు స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు చెప్పుకొస్తున్నారు. చీకిమానుకోనలో పట్టుబడ్డ స్మగ్లర్ల నుంచి రెండు నాటు తుపాకులతో పాటు మూడు లక్షలు విలువ చేసే ఎర్రచందనం దుంగలను అప్పుడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే క‌మెడీయ‌న్‌గా ఎంతో వినోదం పంచిన హ‌రి ఇలాంటి వాడు అని తెలిసి అందరు షాక్ అవుతున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...