Home Film News ఆ సీనియర్ దర్శకుడుకి అంత బలుపా.. బాలయ్య తోనే ఆటలా.. సీటు చిరగాల్సిందేగా..!
Film News

ఆ సీనియర్ దర్శకుడుకి అంత బలుపా.. బాలయ్య తోనే ఆటలా.. సీటు చిరగాల్సిందేగా..!

టాలీవుడ్ లోనే నట‌సింహం నందమూరి బాలకృష్ణకు దర్శకుల హీరో అనే పేరు ఉంది. ఆయనకు కథ నచ్చి మూవీనీ ఓకే చేస్తే పూర్తిగా డైరెక్టర్ కి అయినా సరెండర్ అయిపోతారు.. ఈ క్రమంలోనే బాలయ్యకు హిట్లు ప్లాప్‌లు కూడా ఎదురయ్యాయి. అయితే ఆయనకు మంచి విజ‌యాలు వచ్చినప్పుడు దర్శకులను ప్రశంసించారు.. కానీ ఎప్పుడూ ఫలానా దర్శకుడు వల్ల తన సినిమా ప్లాప్ అయిందని ఎక్కడ ఎవరిని విమర్శించలేదు. చిన్న పెద్ద డైరెక్టర్ అనే బేధం లేకుండా తనతో సినిమా చేసే ప్రతి డైరెక్టర్ కి ఎంతో గౌరవం ఇస్తారు.. అలాగే సాయం చేయడంలోనూ అందరికంటే ముందుంటారు. అందుకే బాలయ్యది బంగారం మనసు అని కూడా అంటారు. అలాంటి బాలకృష్ణపై ఓ దర్శకుడు నోరు పారేసుకున్నాడు దీంతో బాలయ్య అభిమానులు ఆయనపై ఫైర్ అవుతున్నారు.

Jai Simha first look: Nandamuri Balakrishna looks majestic as ever - India Today

కోలీవుడ్ సీనియర్ దర్శకుడు కె.ఎస్ రవికుమార్ కి ఘోర అపజయాలు ఎదురైనప్పుడు ఆయనకు ఏ తమిళ హీరో ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు. అలాంటి సమయంలో బాలకృష్ణ పిలిచి మరి ఆయనకు వరుసగా రెండు అవకాశాలు ఇచ్చారు. ఇక వీరి కాంబోలో 2018లో వచ్చిన జై సింహా ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. ఆ తర్వాత 2019లో రూలర్ సినిమాతో మరోసారి ఈ కాంబో రిపీట్ అయింది. అయితే ఈ సినిమాలో బాలకృష్ణ పోలీస్ గెటప్ పైన చాలా ట్రోల్స్ కూడా వచ్చాయి. దీంతో ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. అయినా కూడా బాలయ్య ఎప్పుడు రవికుమార్ ని ఒక్క మాట కూడా అనలేదు. అయినప్పటికీ కె ఎస్ రవికుమార్ కొలీవుడ్‌లో బాలయ్య పై జోకులు వేసుకుని తన పబ్బం గడుపుతున్నాడు.

Happy Birthday, KS Ravikumar: Award-winning films of the entertaining director | The Times of India

ఇక తాజాగా ‘గార్డియన్స‌ అనే ఓ తమిళ సినిమా ప్రెస్ మీట్ కు హాజరైన రవికుమార్ బాలయ్య పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. బాలకృష్ణ షూటింగ్లో ఎవరైనా నవ్వినట్టు కనిపిస్తే వారు ఆయనని చూసి నవ్వుతున్నారనుకునీ ఆయన ఊరికనే కోపం తెచ్చుకుంటారని.. వెంటనే ఆ వ్యక్తిని పిలిచి కొడతారని రవికుమార్ ఆ ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు. ఒకసారి నా అసిస్టెంట్ డైరెక్టర్ శరవణన్ అనుకోకుండా ఫ్యాన్ ని బాలకృష్ణ వైపు తిప్పడంతో ఆయన విగ్గు ఎగిరిపోయింది అది చూసి శరవణన్ చిన్నగా నవటంతో బాలకృష్ణకు కోపం వచ్చి అతనిపై గట్టిగా అరిచారు ఎక్కడ కొడతారేమోనన్న భయంతో నేనే శరవన్‌న్ని అక్కడి నుంచి పక్కకు తీసుకువెళ్లాలని రవికుమార్ చెప్పుకొచ్చాడు.

హీరో బాలకృష్ణ నిజ స్వరూపాన్ని బయటపెట్టిన తమిళ స్టార్ డైరెక్టర్ | KS Ravi Kumar Shocking Comments On Balakrishna Behaviour - Sakshi

అయితే ఇప్పుడు బాలకృష్ణపై కేఎస్ రవికుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారమే రేపాయి. ఓ సీనియర్ దర్శకుడు అయ్యుండి కనీసం బుద్ధి లేకుండా.. ఓ సినిమా వేడుకలో స్టార్ హీరో గురించి ఇలాంటి కామెంట్స్ ఏంటని అందరూ ఆయనను తప్పుపడుతున్నారు. ఇక బాలయ్య అభిమానులైతే ఓ రేంజ్ లో ఆయన పై ఫైర్ అవుతున్నారు. అవకాశాలు లేక ఇబ్బంది పడుతుంటే పిలిచి మరి రెండు సినిమా అవకాశాలు ఇస్తే.. ఇప్పుడు అవకాశం ఇచ్చిన హీరో పైనే ఇలాంటి సెటైర్లు వేస్తున్నాడా.. అసలు బాలకృష్ణ ఇలాంటి విశ్వాసం లేని వారిని తన దగ్గరికి కూడా రానివ్వకూడదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...