Home Film News భర్తతో విడాకులు… అసలేం జరిగిందో చెబుతూ నయనతార ఎమోషనల్​ వీడియో పోస్ట్..! ​
Film News

భర్తతో విడాకులు… అసలేం జరిగిందో చెబుతూ నయనతార ఎమోషనల్​ వీడియో పోస్ట్..! ​

టాలీవుడ్, కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది లేడీ సూపర్ స్టార్ నయనతార. స్టార్ హీరోల సరసన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన నయన్.. హీరోలతో సమానంగా క్రేజ్ దక్కించుకుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న నయన్.. 2022లో స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఎంత స్టార్ డమ్ వచ్చిన సోషల్ మీడియాకు దూరంగా ఉండే నయన్.. ఇటీవలేఇన్‌స్టాగ్రామ్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

Happy Birthday Nayanthara: 5 Must-Watch Films Of The Jawan Actress And Where Can You Stream Them

పెళ్లి తర్వాత సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన నయన్.. అప్పుడప్పుడు తన భర్త, పిల్లలకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా ఆమె భర్త విఘ్నేష్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ ఫాలో చేయడంతో రకరకాల రూమర్స్ వైరల్‌య్యాయి. అయితే ఇప్పుడు ఈ వార్తలపై దర్శకుడు న‌య‌న్ భ‌ర్త‌ విఘ్నేశ్ స్పందించారు. సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ వీడియోను పోస్ట్ చేశారు. ఆయన పెట్టిన కాసేపటికే నయన్​ కూడా అదే ఎమోషన్ వీడియోను పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం దాని గురించే చర్చ సాగుతోంది. పూర్తి వివరాలు ఇక్క‌డ తెలుసుకుందాం..

సోషల్ మీడియాలో పెద్ద రచ్చే :చిత్ర పరిశ్రమలో ఉండే స్టార్ సెలబ్రిటీలకు సంబంధించిన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన వార్తలు అంటే ప్రతి ఒక్కరికి ఎంతో ఆసక్తి.. మరి ముఖ్యంగా వారు ఏం చేస్తున్నారు.. ఎవరితో సంబంధం పెట్టుకున్నారు.. ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారు.. ఎవరు విడిపోతున్నారు.. అనే దానిపై తెలుసుకోవాలని అందరూ ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక మన సౌత్ స్టార్ సెలబ్రిటీలలో స్టార్ హీరోయిన్ లో కొనసాగుతున్న నయనతార అంటే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎందరో అభిమానులు ఉన్నారు. ఇక ఆమెకు సంబంధించిన ఎలాంటి వార్తలైనా ఇట్టే వైరల్ అవుతాయి. అయితే ఎప్పుడు తాజాగా ఇద్దరు కవల పిల్లలు భర్తతో సంతోషంగా ఉన్న ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త తెగ హల్చల్ చేస్తుంది.

ఇంతకీ ఆ వార్త ఏమిటంటే.. నయనతార విడాకులు తీసుకోబోతున్నారనే చర్చ ఎక్కడ చూస్తున్నా ఇదే జరుగుతుంది. తాజాగా న‌య‌న్‌ తన భర్త విఘ్నేష్ శివన్ ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ ఫాలో చేయడమే సోషల్ మీడియాలో ఈ గోలకు పెద్ద కారణం. అయితే నిజంగానే నయనతార తన భర్తను అన్ ఫాలో చేసిందా..? లేక సాంకేతిక సమస్యల వల్ల అది అలా జరిగిందా.. అనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అంతలోనే మళ్లీ తన భర్తను ఫాలో చేసింది. ఏం జరిగిందో తెలియదు కానీ ఈ మధ్య సెలబ్రిటీలు సమంతతో మొదలుపెట్టి ఇప్పటి నిహారిక వరకు అందరూ విడాకులకు ముందు అన్ ఫాలోనే చేస్తున్నారు.

Nayanthara | నయనతార, విగ్నేశ్‌ శివన్ మధ్య అసలు ఏం జరుగుతుంది..?-Namasthe Telangana

ఫేక్‌ వార్తలకు చెక్: అయితే ఇప్పుడు నయనతార కూడా అందుకే అలా చేసిందని అంతా అనుకున్నారు. అయితే తాజాగా దానిపై నయనతార భ‌ర్త‌ విఘ్నేష్ శివన్ స్పందించారు. డైరెక్ట్ గా ఈ విషయంపై మాట్లాడలేదు కానీ గతంలో జరిగిన ఎమోషనల్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈ వార్తలకు చెక్ పెట్టారు. ఆ వీడియో గతేడాది తమ పెళ్లిరోజు జరుపుకున్న అప్పుడుదని తెలుస్తుంది. దానినే మళ్లీ షేర్ చేసి విడాకులపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్టు తెలుస్తుంది. ఇక ఆ విడియోలో ఒక వ్యక్తి ఫ్లూట్ వాయిస్తూ కనిపించారు.. ఆయన పక్కన నయనతార విగ్నేష్ కూర్చుని మ్యూజిక్ వింటున్నాడు. ఈ క్రమంలోని న‌య‌న్‌ భర్తను పట్టుకుని ముద్దులు పెడుతూ ఎమోషనల్ అవటం కనబడుతుంది. ఇక మళ్లీ అదే వీడియోని నయనతార కూడా తన సోషల్ మీడియాలో రి పోస్ట్ చేసింది. ఈ వీడియో ద్వారా తమ బంధం బలంగానే ఉందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను కొట్టి పడేసారు.

 

View this post on Instagram

 

A post shared by Navin (@flutenavin)

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...