Home Film News Allu Arjun Cried: భార్య స్నేహా రెడ్డిని ప‌ట్టుకొని ఏడ్చేసిన అల్లు అర్జున్.. రోజు రోజుకు క్రేజ్ పెంచుకుంటున్న బ‌న్నీ
Film News

Allu Arjun Cried: భార్య స్నేహా రెడ్డిని ప‌ట్టుకొని ఏడ్చేసిన అల్లు అర్జున్.. రోజు రోజుకు క్రేజ్ పెంచుకుంటున్న బ‌న్నీ

Allu Arjun Cried: మెగా హీరోగా ఇండ‌స్ట్రీగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ‌న్నీ మెల్ల‌మెల్ల‌గా అల్లు హీరోగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ని చాటుకుంటున్నాడు. మొన్న‌టి వ‌ర‌కు స్టైలిష్ స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ బిరుదు అందుకొని  పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. పుష్ప చిత్రంలో బ‌న్నీ న‌ట‌న‌కి దేశ వ్యాప్తంగా ప్రశంస‌లు ద‌క్కాయి. ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ నేష‌న‌ల్ అవార్డ్ ద‌క్కంచుకున్నాడు.  తొలిసారి ఓ తెలుగు యాక్టర్‌కి బెస్ట్ యాక్టర్‌ అవార్డు వరించ‌డంతో బ‌న్నీతో పాటు ఆయ‌న అభిమానులు, ఫ్యామిలీ,  చిత్ర యూనిట్ అంతా ఇంతా కాదు.  ఈ సంతోషాన్ని టాలీవుడ్‌ మొత్తం సెలబ్రేట్ చేసుకోవ‌డం విశేషం.

పుష్ప సినిమాలో బ‌న్నీ న‌ట‌న‌కి నేష‌న‌ల్ అవార్డ్ రాగా, ఈ చిత్రం ప‌లు విభాగాల‌లో ప‌ది అవార్డులు కూడా ద‌క్కించుకుంది.  ఈ క్ర‌మంలో బ‌న్నీ చాలా ఎమోష‌న‌ల్ అయ్యారు. ఇది నిజంగా నేను  నమ్మలేకపోతున్నాను అంటూ.. బన్నీ సంతోషంగా తన భార్య స్నేహారెడ్డిని పట్టుకుని ఏడ్చేశాడు. అంతేకాక పిల్ల‌ల‌ని ద‌గ్గ‌ర‌కు తీసుకొని ముద్దాడాడు. ఇక త‌ల్లిని గ‌ట్టిగా హ‌గ్ చేసుకున్నాడు. తండ్రి ఆశీర్వాదం తీసుకున్నాడు. చిత్ర ద‌ర్శ‌కుడు, నిర్మాత‌ల‌తో కూడా త‌న సంతోషం పంచుకున్నారు బ‌న్నీ. అయితే తొలిసారి ఓ తెలుగు న‌టుడికి నేష‌న‌ల్ అవార్డ్ రావ‌డంతో బ‌న్నీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది. సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు  ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

బన్నీకి నేష‌న‌ల్ అవార్డ్ ద‌క్కిన నేప‌థ్యంలో  సాయిధరమ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌లు ప్రత్యేకంగా బన్నీ ఇంటికెళ్లి ఆయనకు అభినందనలు తెలిపారు.  అలా పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. బన్నీ ఫ్రెండ్స్ మారుతి, వశిష్ట, బన్నివాసు వంటి వారు ఆయన్ని ఎత్తుకుని  తెగ సంద‌డి చేశారు. పుష్ప` చిత్రానికి జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ని ఎంపిక చేసిన నేప‌థ్యంలో స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ కూడా నిర్వ‌హించారు. ఇక ఇదిలా ఉంటే పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ చిత్తూరు యాసలో అదరగొట్టి విమ‌ర్శ‌కుల ప్ర‌శంసలు అందుకున్నాడు.  ఎర్ర చందనం స్మగ్లర్ పాత్రలో అల్లు అర్జున్ నెవర్ బిఫోర్ అనిపించే విధంగా త‌న అభిన‌యంతో ఆక‌ట్టుకున్నాడు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...