Home Film News Saidharam: సాయిధ‌ర‌మ్ బైక్ యాక్సిడెంట్ త‌ర్వాత బైక్స్ అన్నీ అమ్మేసిన ఆయ‌న ఫ్రెండ‌
Film News

Saidharam: సాయిధ‌ర‌మ్ బైక్ యాక్సిడెంట్ త‌ర్వాత బైక్స్ అన్నీ అమ్మేసిన ఆయ‌న ఫ్రెండ‌

Saidharam: మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకొని వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ వ‌స్తున్నారు. కెరీర్ స‌జావుగా సాగుతున్న స‌మ‌యంలో తేజ్ ప్ర‌మాదానికి కి గురయి చాలా తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. యాక్సిడెంట్ త‌ర్వాత తేజ్  కొన్ని నెలలు చికిత్స తీసుకొని బయటకు రాకుండా, హాస్పిటల్, ఇంట్లోనే ఉన్నారు. మొత్తం రిక‌వ‌ర్ అయ్యాక‌నే ఆయ‌న బ‌య‌టకు వ‌చ్చారు. ఇటీవ‌ల విరూపాక్ష సినిమాతో పెద్ద హిట్ కూడా అందుకున్నారు. ఆ త‌ర్వాత త‌న మావ‌య్యతో క‌లిసి బ్రో అనే సినిమాలో న‌టించ‌గా, రీసెంట్‌గా ఈ చిత్రంతో ప‌ల‌క‌రించాడు. అయితే త‌న త‌దుప‌రి సినిమాకి తేజ్ కాస్త గ్యాప్ తీసుకోబోతున్నాడు.

అయితే సాయితేజ్‌కి ఇండ‌స్ట్రీలో కొంద‌రు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వారిలో ప్రముఖ సీనియర్‌ నటుడు నరేష్‌ కుమారుడైన నవీన్ ఒక‌రు. ఇత‌గాడు  గతంలో కొన్ని సినిమాల్లో హీరోగాను నటించారు. రెండు జెళ్ల సీత, నందిని నర్సింగ్‌ హోమ్‌, ఊరంతా అనుకుంటున్నారు సినిమాల్లో న‌టించి ప్రేక్ష‌కుల‌ని అల‌రించే ప్ర‌యత్నం చేయ‌గా, అవి పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. చాలా గ్యాప్ త‌ర్వాత మెగా ఫోన్ ప‌ట్టుకున్న ఇతను   సాయి తేజ్‌, స్వాతి కలర్స్‌ జంటగా ‘సోల్ ఆఫ్ సత్య’ పేరుతో ఒక షార్ట్ ఫిలిం రూపొందించ‌గా, ఇటీవ‌ల దీనికి సంబంధించి విడుద‌లైన సాంగ్ మంచి  రెస్పాన్స్ అందుకుంది. ఇక దీనికి సంబంధించిన ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొంటూ ప‌లు ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నాడు న‌వీన్.

తాజా ఇంట‌ర్వ్యూలో  సాయిధరమ్ తేజ్‌ బైక్‌ యాక్సిడెంట్‌ నా జీవితంలో చాలా మార్పులు తెచ్చింది అని చెప్పుకొచ్చాడు.  జీవితంలో ఎంత బాధ్యతగా ఉండాలనేది ఆ యాక్సిడెంట్‌ నేర్పించింది.‘ సాయి తేజ్‌ ప్రమాదం జరగడానికి కొద్దిసేపటి ముందు నేనూ సాయి కలిసి బయటకు వెళ్లాం. తిరుగు ప్రయాణంలో నన్ను ఇంటి దగ్గర డ్రాప్‌ చేసి తిరిగి త‌న ఇంటికి బ‌యలు దేర‌గా ఆ స‌మ‌యంలో ప్ర‌మాదం జ‌రిగింది. అప్పుడు సాయికి యాక్సిడెంట్ అయింది అనుకుంటే చిన్న ప్ర‌మాదం అనుకున్నా. కాని ఆసుప‌త్రికి వెళ్లి అక్క‌డి ప‌రిస్థితి చూసి షాక్ అయ్యాను. అది నాకు చాలా పెద్ద పాఠం నేర్పింది.  సాయి తేజ్  రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయడడం చూసి  చాలా ఎమోష‌న‌ల్ అయ్యా. నా ఫోన్ స్విచాఫ్ చేసుకున్నా, ఎవ‌రిని క‌ల‌వ‌లేదు, బైక్స్ అన్నీ అమ్మేశాను అంటూ ఎమోష‌న‌ల్ కామెంట్స్ చేశాడు న‌వీన్.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...