Home Film News Prabhas-NTR: ఏంటి.. ప్ర‌భాస్ క్రేజీ ప్రాజెక్ట్‌ని ఎన్టీఆర్ దొబ్బేసాడా.. ఇండ‌స్ట్రీలో ఇప్పుడు ఇదే చ‌ర్చ‌..!
Film News

Prabhas-NTR: ఏంటి.. ప్ర‌భాస్ క్రేజీ ప్రాజెక్ట్‌ని ఎన్టీఆర్ దొబ్బేసాడా.. ఇండ‌స్ట్రీలో ఇప్పుడు ఇదే చ‌ర్చ‌..!

Prabhas-NTR: ప్ర‌స్తుతం టాలీవుడ్ రేంజ్ బాలీవుడ్  రేంజ్‌కి వెళ్లిన విష‌యం తెలిసిందే. మ‌న సినిమాల‌పై అన్ని ఇండ‌స్ట్రీలు ప్ర‌త్యేక దృష్టిసారిస్తున్నాయి. ఇక్క‌డి హీరోలు వైవిధ్య‌మైన సినిమాల‌తో పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాలు చేస్తుండ‌గా, ఈ సినిమాల‌కి దేశ వ్యాప్తంగానే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా ఆద‌ర‌ణ ల‌భిస్తుంది.  బాహుబ‌లి సినిమాతో ప్రభాస్ తెలుగు సినిమా ఖ్యాతిని రెండింత‌లు చేశాడు. ఈ సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ చేసిన సినిమాల‌న్నీ కూడా పాన్ ఇండియా రేంజ్‌లోనే విడుద‌ల అవుతున్నాయి. ప్ర‌భాస్ న‌టించిన స‌లార్ చిత్రం సెప్టెంబర్ 28న విడుద‌ల కానుండ‌గా, ఈ సినిమా కోసం ప్ర‌తి ఒక్క‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చ‌రణ్, ఎన్టీఆర్‌ల‌కి కూడా గ్లోబ‌ల్ స్టార్‌డ‌మ్ ద‌క్కింది.ఈ సినిమా అందించిన జోష్‌తో ఇద్ద‌రు హీరోలు బ‌డా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. అయితే  ఎవరు అవునన్నా కాదన్నా.. రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం ఫస్ట్ పాన్ ఇండియన్ హీరో. పాన్ ఇండియన్ సినిమాలకు కేరాఫ్‌గా మారిన ప్ర‌భాస్ సినిమాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ దొబ్బేశార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి..ఆ సినిమాలో ప్రభాస్‌కి రీస్లేస్ గా జూనియ‌ర్ మారిపోయారట.ఇప్పుడు ఈ విష‌యంపై జోరుగా ప్ర‌చారం సాగుతుంది.  యశ్‌ రాజ్ స్పై యూనివర్స్‌లో నటించే ఛాన్స్ ముందుగా ప్ర‌భాస్‌కి వ‌చ్చింద‌ట.ఈ నిర్మాణ సంస్థ ప్ర‌స్తుతం  అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో.. వార్ 2 చేస్తుంది.

ఈ చిత్రంలో  హృతిక్‌ను ఢీకొట్టబోయే ఛాన్స్ మొదట ప్రభాస్‌కి రాగా ఆయ‌న ప‌లు కార‌ణాల వ‌ల‌న నో చెప్పిన‌ట్టు స‌మాచారం. దాంతో యశ్‌ రాజ్ మేకర్స్ ప్రభాస్‌ కు ఆల్టర్ నేటివ్‌గా మరో స్టార్ ఎవ‌రైతే బాగుంటుంద‌ని చూసి చివ‌ర‌కు  యంగ్ టైగర్‌ను .. వార్ 2 విలన్‌ రోల్‌ కోసం  ఫిక్స్ చేసుకున్నారట . ఇక ఈ ప్రాజెక్ట్‌కి ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో..ఈ మూవీలో అఫీషియల్‌గా.. ఆన్‌ బోర్ట్ కార్డ్ వచ్చేలా చేసుకున్నారు జూనియ‌ర్ ఎన్టీఆర్ . మొత్తానికి ప్ర‌భాస్ క్రేజీ ప్రాజెక్ట్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ఈ చిత్రంతో ఎంత పేరు ప్ర‌తిష్ట‌లు సంపాదించుకుంటాడో చూడాలి.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...