Sri Lakshmi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోహీరోయిన్ల తర్వాత కమెడియన్స్ కి కూడా ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. బ్రహ్మనందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్. ఎస్. నారాయణ ఇలాంటి కమెడియన్లు ఎంతోమంది ఉన్నారు. టాలీవుడ్ లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఫీమేల్ కమెడియన్స్ కూడా ఉన్నారు. వారిలో శ్రీలక్ష్మీ కూడా ఒకరు. ఆవిడ స్టైల్ లో జంధ్యాల గారి మూవీస్ లో ఎంతో భిన్నంగా ఉండే యాక్టింగ్, డైలాగ్స్ తో ఎంతగానో నవ్వించారు. దాదాపు 500 సినిమాల్లో యాక్ట్ చేసిన నటి శ్రీలక్ష్మీ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలను షేర్ చేసుకున్నారు. ‘మా నాన్నకు మేము ఎనిమిది మంది పిల్లలం. నాన్న అమర్నాథ్. ఎన్టీఆర్, ఏఎన్నార్ హీరోలుగా ఉన్న టైమ్ లో ఇండస్ట్రీలో పెద్ద హీరో. జాండీస్ రావడంతో నాన్న ఇంక వర్క్ చేయడం మానేశాడు. సైడ్ క్యారెక్టర్లు వస్తే తాను హీరోగా మాత్రమే చేస్తానని లేకపోతే లేదని.. చనిపోయిన హీరో స్టేటస్ తోనే చనిపోతానని మొండికేసి చెప్పేశారు.

కొంతకాలం తర్వాత ఆర్థికంగా సమస్యలు రావడంతో అమ్మ నన్ను సినిమాల్లోకి పంపాలని నిర్ణయించుకుంది. కానీ నాన్నకు ఇష్టం లేదని అన్నారు. అమ్మ.. నువ్వు నటిస్తేనే అందరం కడుపు నిండా తినగలమని లేదంటే విషం తాగి చనిపోతామని అన్నారట. ఆ తర్వాత తండ్రి అమర్ నాథ్ చనిపోవడంతో.. కుటుంబాన్ని ఆదుకోవడానికి సినిమాల్లోకి వచ్చారు. అప్పుడే కె. విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో ఓ సినిమా, బాపు గారి డైరెక్షన్ లో ఓ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. కానీ ఈ సినిమాల్లో నటించలేకపోయారట.

ఆ తర్వాత నివురుగప్పిన నిప్పు మూవీలో కమెడియన్ గా యాక్ట్ చేసారు. ఆ తర్వాత జంధ్యాల గారి మూవీ రెండు జడల సీత మూవీతో శ్రీలక్ష్మీకి టర్నింగ్ పాయింట్ దక్కింది. లేడీ కమెడియన్ గా సక్సెస్ అయ్యారు. ఇక ముఖ్యంగా శ్రీలక్ష్మీ కోసమే డైరెక్టర్లు ఓ క్యారెక్టర్ ని క్రియేట్ చేసుకునే రేంజ్ కు ఎదిగారు. ఆ మూవీ నుండి దాదాపు 13 ఏళ్ల పాటు తిరుగులేని లేడి కమెడియన్ గా ఎదిగారు. అయితే తనకు పిల్లలు లేరని.. జీవితంలో ఆ కొరత ఎప్పటికీ ఉంటుందని శ్రీలక్ష్మీ బాధపడ్డారు.