Home Film News RRR Movie : రామ్ – భీమ్ ర్యాంపేజ్ కంటిన్యూస్..
Film News

RRR Movie : రామ్ – భీమ్ ర్యాంపేజ్ కంటిన్యూస్..

RRR NETFLIX
RRR NETFLIX

RRR Movie: దర్శకధీరుడు రాజమౌళి ఏ ముహూర్తాన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల కాంబినేషన్‌లో మల్టీస్టారర్ మూవీ అనౌన్స్ చేశారో కానీ అప్పటినుండి అంచనాలకు ఆకాశమే హద్దు అన్నట్టు తయారయ్యింది పరిస్థితి.

మీడియా, సోషల్ మీడియాతో పాటు యావత్ ప్రపంచం ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూసింది. అలియా భట్, ఒలీవియా మోరిస్, అలిసన్ డూడీ, రే స్టీవెన్ సన్, అజయ్ దేవ్‌గణ్, శ్రియ లాంటి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ యాక్టర్స్ నటించిన ఈ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది.

అంచనాలకు మించి వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి అందర్నీ ఆశ్చర్యపరచడమే కాక.. మరోసారి తెలుగు సినిమా సత్తా ఏంటనేది ప్రపంచానికి చాటిచెప్పింది. పాపులర్ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’ స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికి 10 వారాలకు పైగా ట్రెండింగ్‌లో కంటిన్యూ అవుతోంది.

ఇంగ్లీష్ ఫిలిం కాకుండా గ్లోబల్ వైడ్‌గా ట్రెండింగ్‌లో ఈ రేర్ ఫీట్ సాధించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’ కావడం విశేషం. రిలీజ్ తర్వాత సినిమా గురించి, రాజమౌళి దర్శకత్వ ప్రతిభ గురించి, జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన నటన గురించి పలు దేశాలకు చెందిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఎంతో గొప్పగా, ఎన్నో ఆర్టికల్స్ రాస్తున్నాయి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...