Home Film News NBK 107 : అందరి నోటా ఒకటే మాట ‘జై బాలయ్య’..
Film News

NBK 107 : అందరి నోటా ఒకటే మాట ‘జై బాలయ్య’..

NBK 107 Kurnool Schedule
NBK 107 Kurnool Schedule

NBK 107: నటసింహా నందమూరి బాలకృష్ణకి మాస్‌లో ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో కొత్తగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో వీరాభిమానులు వీర లెవల్లో ఉంటారనే సంగతి తెలిసిందే. దాదాపు 5 రోజుల పాటు కర్నూలు పరిసరప్రాంతాలు బాలయ్య నామస్మరణతో మారుమ్రోగిపోయాయి.

బాలయ్య, గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ NBK 107 జూలై 20 నుండి 25 వరకు కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో షూటింగ్ జరపుకుంది. జూలై 26న పంచలింగాల వద్ద షూటింగ్ చెయ్యాలనుకున్నారు కానీ వర్షం కారణంగా షెడ్యూల్ ముగించుకుని టీం హైదరబాద్ వచ్చేశారు.

షూటింగ్ జరిగినన్ని రోజులు బాలయ్యను చూడ్డానికి రాయలసీమలోని పలు ప్రాంతాలనుండి అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొండారెడ్డి బురుజు జనసంద్రాన్ని తలపించింది. వయసుతో సంబంధం లేకుండా పిల్లల దగ్గరినుండి పండు ముసలి వరకూ అందరూ బాలయ్యను చూడ్డానికి వచ్చారు.

పోలీసు వారితో సహా అభిమానులకు, తెలుగుదేశం పార్టీ వారికి చాలా ఓపిగ్గా ఫొటోలిచ్చారు బాలయ్య. ఓ అభిమానిని గుర్తుపెట్టుకుని మరీ పిలిచి అతని కుటుంబంతో కలిసి భోజనం చేశారు. బుల్లి అభిమానిని ఆడించారు. ఇందుకు సంబంధించిన పిక్స్, వీడియోస్ నెట్టింట పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...