Home Film News Dulquer Salmaan: స్టేజ్‌పై అంద‌రి ముందు ప్రైవేట్ పార్ట్‌ని ట‌చ్ చేసింది.. ఆ మ‌హిళ వ‌ల్ల చాలా ఇబ్బంది ప‌డ్డాను
Film News

Dulquer Salmaan: స్టేజ్‌పై అంద‌రి ముందు ప్రైవేట్ పార్ట్‌ని ట‌చ్ చేసింది.. ఆ మ‌హిళ వ‌ల్ల చాలా ఇబ్బంది ప‌డ్డాను

Dulquer Salmaan: అభిమానుల వ‌ల‌న హీరోయిన్స్‌కే కాదు, హీరోలు కూడా  చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు. లేడి అభిమానులు కూడా హీరోల‌ని ఇబ్బందులు పెట్టిన ప‌రిస్థితులు లేక‌పోలేదు.తాజాగా ఓ యువ హీరో లేడి అభిమాని వ‌ల‌న ఎలాంటి ఇబ్బంది ప‌డ్డాడో చెప్పుకొచ్చాడు. ఆయ‌న చెప్పిన మాట‌లు ఇప్పుడు నెట్టింట చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయి. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌ర‌నే క‌దా మీ డౌట్ దుల్క‌ర్ స‌ల్మాన్. మ‌ల‌యాళ హీరో అయిన కూడా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మ‌హాన‌టి, సీతారామం చిత్రాల‌తో దుల్క‌ర్‌కి టాలీవుడ్‌లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా పెరిగింది. దుల్క‌ర్ మ‌రి కొద్ది రోజులలో  కింగ్ ఆఫ్ కోత  అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా కోసం గ‌త కొద్ది రోజులుగా ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్‌లో పాల్గొంటున్నాడు. ఈ క్ర‌మంలో అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు కూడా తెలియ‌జేస్తున్నాడు.

తాజాగా దుల్క‌ర్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ..   నాకు ఎక్కువగా అబ్బాయిల్లో ఫ్యాన్స్ ఉండేవారు. కానీ సీతారామం,ఓకే బంగారం వంటి సినిమాల తర్వాత లేడీ ఫ్యాన్స్ విప‌రీతంగా  పెరిగిపోయారు. వారి వ‌ల‌న ఎన్నోసార్లు ఇబ్బందిప‌డ్డాను.   అమ్మాయిలు సెల్ఫీల కోసం రావ‌డం వ‌ర‌కు ఓకే కాని కొంద‌రు ఏకంగా ముద్దు పెట్టేస్తుంటారు. వాళ్లు అలా చేయ‌డం నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఓ సారి పెద్దావిడ స్టేజ్‌పైకి వ‌చ్చి న‌న్ను అస‌భ్య‌క‌రంగా తాకింది. అంత‌మందిలో ఆమె చేసిన ప‌ని నాకు చిరాకు తెప్పించింది.  ఆక్షణం నేను చాలా  ఇబ్బందిపడ్డాను అని దుల్కర్ సల్మాన్ స్ప‌ష్టం చేశారు. పిచ్చి ప‌నులు నాకు ఏ మాత్రం నచ్చవు, వాటిని స‌హించ‌ను అని కూడా దుల్క‌ర్ అన్నారు.

ఇక ఇటీవ‌ల రానా మాట్లాడిన మాటలు పెద్ద వివాదాస్పందం కాగా ..దానిపై స్పందించిన దుల్క‌ర్ స‌ల్మాన్.. రానా అలా మాట్లాడతారని ఊహించ‌లేదు. నా గురించి చెప్పాల‌నుకోగా, అనుకోకుండా హీరోయిన్ విష‌యం వ‌చ్చింది. రాని చేసిన కామెంట్స్ త‌న వ్య‌క్తిగ‌తం. వాటిని నేను ప‌ట్టించుకోను . త‌న వ‌ల‌న మేము ఇబ్బంది ప‌డ్డాం అని భావించిన రానా త‌ర్వాత క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పారు. ఇండ‌స్ట్రీలో నాకు చాలా మంది స్నేహితులు ఉండ‌గా, వారిలో రానా కూడా ఒక‌రు అని దుల్కర్ స్ప‌ష్టం చేశారు.   ప్ర‌స్తుతం దుల్క‌ర్ చేసిన కామెంట్స్ అయితే హాట్ టాపిక్ గా మారాయి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...