Home Film News Anasuya: అన‌వ‌స‌రంగా నా పేరు వాడేస్తున్నారు.. మ‌ళ్లీ ఫైర్ అయిన అన‌సూయ‌
Film News

Anasuya: అన‌వ‌స‌రంగా నా పేరు వాడేస్తున్నారు.. మ‌ళ్లీ ఫైర్ అయిన అన‌సూయ‌

Anasuya: అందాల ముద్దుగుమ్మ అన‌సూయ ఇటీవ‌ల కాంట్ర‌వ‌ర్సీస్ తో ఎక్కువ సావాసం చేస్తుంది.జబర్ధస్త్ అనే కామెడీ షో ద్వారా వెలుగులోకి వచ్చి.. యాక్టింగ్ అండ్ యాంకరింగ్ స్కిల్స్‌తో త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్‌గా ఎదిగిపోయింది అందాల‌ అనసూయ. కెరీర్ ప్రారంభంలో టెలివిజన్ రంగానికే పరిమితం అయిన  అన‌సూయ ఆ తర్వాత సినిమాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. ఇక్క‌డ మంచి ఆద‌ర‌ణ ల‌భించ‌డంతో వ‌రుస పెట్టి సినిమాలు చేస్తుంది. ఇటీవ‌ల విమానంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన ఈ భామ ప్ర‌స్తుతం పుష్ప 2 చిత్రంతో పాటు ప‌లు సినిమాలు చేస్తుంది.

అయితే అన‌సూయ‌కి షార్ట్ టైంలో ఇంత పేరు రావ‌డానికి కార‌ణం వివాదాలే అని చెప్ప‌వ‌చ్చు .ఆమె డ్రెస్సింగ్ , సోష‌ల్ మీడియాలో చేసే పోస్ట్‌లు అన‌సూయ‌పై విమ‌ర్శ‌లు చేసేలా చేసింది. అయితే త‌న‌పై ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఎక్క‌డ త‌గ్గ‌లేదు. త‌న బ‌ట్టల విష‌యంలో కామెంట్ చేసిన వారికి నా  బట్టలు నా ఇష్టం. అవి నాకు సౌకర్యం అనిపిస్తే చాలు, జడ్జి చేయడానికి మీరెవరంటూ గ‌ట్టిగానే ఇచ్చిప‌డేసింది.  ఇక  కొద్ది రోజుల క్రితం హీరో విజయ్ దేవరకొండతో ఎలా గొడ‌వ‌ప‌డిందో మనం చూశాం. అర్జున్ రెడ్డి మూవీతో మొదలైన ఆ సెగ ఖుషీ వ‌ర‌కు వ‌చ్చింది. ఇటీవ‌ల జ‌రిగిన ఇంట‌ర్వ్యూలో  అన‌సూయ మాట్లాడుతూ..విజయ్ దేవరకొండ తన మనుషులతో నాపై డబ్బులిచ్చి ట్రోలింగ్ చేయించాడు,  ఇక అత‌నితో వివాదం కొనసాగించే ఆలోచన లేదని సంధికి వ‌చ్చాను అని చెప్పుకొచ్చింది.

ఇక తాజాగా అన‌సూయ ..తన హేటర్స్ మీద అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. ‘వావ్… నేను వాళ్లకు చాలా ముఖ్యం అని అర్ధ‌మైంది.. నా ప్రమేయం ఉన్నా లేకున్నా, నాకు సంబంధం ఉన్నా లేకున్నా కూడా  నా పేరు ఎత్తకుండా ఒక్క డిస్కషన్ కూడా జరగదంతే…  నాపై అంతా డిపెండ్ అయి ఉన్నారు. నా పేరు లేకుండా పాపం ఏదీ చెప్పలేకపోతున్నారు.. అంటూ త‌న అస‌హ‌నం వ్య‌క్తం చేసింది అన‌సూయ‌. అయితే అనసూయ ఈ ట్వీట్లో ఎవరి పేరూ ప్రస్తావించలేదు. దాంతో మళ్ళీ వివాదం ఎవరితో? మిమ్మల్ని ఎవరేమన్నారు? అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...