Home Film News Sharwanand Haldi: మొద‌లైన శ‌ర్వానంద్ పెళ్లి హంగామా.. హ‌ల్దీ వేడుక‌ల‌లో నానా ర‌చ్చ‌…!
Film News

Sharwanand Haldi: మొద‌లైన శ‌ర్వానంద్ పెళ్లి హంగామా.. హ‌ల్దీ వేడుక‌ల‌లో నానా ర‌చ్చ‌…!

Sharwanand Haldi: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్ లో ఒక‌రైన శ‌ర్వానంద్ ఎట్ట‌కేల‌కి పెళ్లి పీట‌లు ఎక్కుతున్నాడు. ఆ మ‌ధ్య ఓ షోలో ప్ర‌భాస్ పెళ్లి త‌ర్వాత తాను చేసుకుంటాన‌ని చెప్పిన శ‌ర్వానంద్ అత‌నిక‌న్నా ముందే జీవిత భాగ‌స్వామితో క‌లిసి ఏడ‌డుగులు వేయ‌బోతున్నాడు. జనవరి 26నే వీరికి నిశ్చితార్థ వేడుక‌ జరగ్గా.. ఆర్నెళ్ల తర్వాత పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారు. మ‌ధ్య‌లో శ‌ర్వానంద్ పెళ్లి ఆగిపోయింద‌ని ప్ర‌చారాలు జ‌ర‌గ‌డం, రీసెంట్‌గా శ‌ర్వానంద్ కారు యాక్సిడెంట్‌కి గురి కావ‌డంతో పెళ్లిపై అనేక సందేహాలు నెల‌కొన్నాయి. కాని వాటిని ప‌టా పంచ‌లు చేస్తూ శ‌ర్వానంద్ త‌న పెళ్లి హంగామా మొద‌లు పెట్టారు. ప్ర‌స్తుతం ప్రీ వెడ్డింగ్ వేడుక‌లు చాలా సంద‌డిగా సాగుతున్నాయి.

రాజస్థాన్‌, జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో వీరి పెళ్లి అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌నుంది. నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు పలువురు ప్రముఖ సినీ నటులు, వధూవరుల సన్నిహితులు, బంధువులు భారీ ఎత్తున హాజ‌రు కానున్న‌ట్టు తెలుస్తుంది. వారి కోసం శ‌ర్వానంద్ అక్క‌డ అన్ని ఏర్పాట్లు చేశాడ‌ట‌. తాజాగా కొత్త జంట‌ హల్దీ ఫంక్షన్ వేడుక‌లో తెగ సంద‌డి చేశారు. హల్దీ ఫంక్షన్ లో కొత్త జంట ఆడిపాడి సంద‌డి చేశారు. బంధు మిత్రుల నడుమ శర్వానంద్ త‌న వివాహ వేడుకలను ఎంతగానో ఆస్వాదిస్తున్నారు. శర్వానంద్-రక్షిత రెడ్డిల హల్దీ ఫంక్షన్ ఫోటోలు, వీడియోలు ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

 

ఈ రోజు ఉద‌యం 11గంట‌ల‌కు శ‌ర్వానంద్ వివాహ వేడుక జ‌ర‌గ‌నుండ‌గా, గ‌త‌ రాత్రి పెళ్లికొడుకును తయారుచేసే ఆచారాలతో పాటు సంగీత్, మెహందీ సెలబ్రేషన్స్ కూడా జరిపిన‌ట్టు తెలుస్తుంది.మొత్తానికి కొత్త జంట మాత్రం పెళ్లికి ముందు కుటుంబ స‌భ్యుల‌తో ఫుల్‌గా ఎంజాయ్ చేసిన‌ట్టు తెలుస్తుంది.శ‌ర్వానంద్ చేసుకోబోయే అమ్మాయి… తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, దివంగత టీడీపీ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి మనవరాలు అవుతుంది . రక్షిత ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటూ ఉద్యోగం చేస్తోందని అంటున్నారు. పెళ్లి త‌ర్వాత ఉద్యోగం మానేసి కుటుంబంతో ఎక్కువ టైం స్పెంట్ చేస్తుంద‌ని ఇన్‌సైడ్ టాక్.

 

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...