Home Film News Its Official: నవంబర్ లో వరుణ్ తేజ్-లావ‌ణ్య త్రిపాఠి వివాహం.. ఈ రోజు అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేసే ఛాన్స్
Film News

Its Official: నవంబర్ లో వరుణ్ తేజ్-లావ‌ణ్య త్రిపాఠి వివాహం.. ఈ రోజు అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేసే ఛాన్స్

Its Official: గ‌త కొద్ది రోజులుగా వ‌రుణ్ తేజ్- లావ‌ణ్య త్రిపాఠి ప్రేమ పెళ్లి వ్య‌వ‌హారం ఇండ‌స్ట్రీలో ఎంత చ‌ర్చ‌నీయాంశంగా మారిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మిస్ట‌ర్ చిత్రంలో క‌లిసి న‌టించిన ఈ జంట అప్పుడే ప్రేమ‌లో ప‌డ్డార‌ని క‌లిసి వివాహం చేసుకోవాల‌ని కూడా భావించార‌ని అనేక ప్ర‌చారాలు న‌డిచాయి. ఇక గ‌త వారం నుండి జూన్ 9న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం జరగ‌బోతుంద‌ని అనేక వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అయితే దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రు స్పందించ‌లేదు. అయితే  సీనియర్ జర్నలిస్ట్, మెగా ఫ్యామిలీకి సన్నిహితుడు అయిన ప్రభు .. వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠిల పెళ్లికి సంబంధించి వ‌స్తున్న వార్త‌ల‌లో నిజం ఉంద‌ని పేర్కొన్నాడు.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి  పెద్దల అంగీకారంతో జర‌గ‌నుంద‌ని ఆయన చెప్పారు.  జూన్ 9న వరుణ్, లావణ్యల నిశ్చితార్థం జ‌ర‌గ‌నుంది అనే విషయాన్ని శనివారం నాగబాబు ప్రకటిస్తారని ప్రభు స్ప‌ష్టం చేశారు. ప‌ని మీద దుబాయ్ వెళ్లిన నాగ‌బాబు..గురువారం రాత్రి హైదరాబాద్ కి వచ్చారని.. ప్ర‌స్తుతం లావణ్య త్రిపాఠి తల్లి కూడా నగరంలోనే ఉన్నారని ప్రభు తెలియ‌జేశారు. నిశ్చితార్థ వేడుక, పెళ్లికి సంబంధించి ప్ర‌స్తుతం ఇరు కుటుంబాల మ‌ధ్య అనేక చర్చ‌లు జ‌రుగుతున్నాయని ఆయ‌న అన్నారు. ఇక  వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్టు ప్ర‌భు తెలియ‌జేశాడు. మరి ఈ పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగా.. లేక‌ హైదరాబాద్‌లోనే జరుగుతుందా అనే విషయాలు ఇంకా స్ప‌ష్ట‌త రాలేద‌ని అన్నారు.

అయితే జూన్ 9న వారి నిశ్చితార్థం జరిపి .. నవంబర్‌లో పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేయాలని కుటుంబ స‌భ్యులు భావిస్తున్న‌ట్టు అనుకుంటున్నార‌ట‌. వీటిపై నాగ‌బాబు నేడు అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మొత్తానికి గ‌త కొద్ది రోజులుగా జోరుగా జ‌రుగుతున్న ప్ర‌చారాల‌కి నేడు పులిస్టాప్ ప‌డ‌నుంది. కాగా,  వరుణ్-లావణ్య త్రిపాఠి  తొలిసారి ‘మిస్టర్’ సినిమాలో కనిపించ‌గా, ఆ త‌ర్వాత ‘అంతరిక్షం’ సినిమాలో కలిసి నటించారు. రెండు సినిమాల‌కే వీరిద్ద‌రి మ‌ధ్య బాండింగ్ మ‌రింత స్ట్రాంగ్ గా మారి పెళ్లి వ‌ర‌కు వ‌చ్చింది. కాగా, ‘అందాల రాక్షసి’ సినిమాతో వెండితెరకు పరిచయమయిన లావ‌ణ్య త్రిపాఠి చివ‌రిగా  ‘హ్యాపీ బర్త్‌డే’ సినిమాతో ప‌ల‌క‌రించింది.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...