Home Film News Vakeel Saab Beauty: వ‌కీల్ సాబ్ బ్యూటీ అన్ని కోట్లు ఎలా సంపాదించింది..ఆమె ఆస్తులు ఎంతో తెలుసా?
Film News

Vakeel Saab Beauty: వ‌కీల్ సాబ్ బ్యూటీ అన్ని కోట్లు ఎలా సంపాదించింది..ఆమె ఆస్తులు ఎంతో తెలుసా?

Vakeel Saab Beauty: తెలుగింటి సీత‌మ్మ‌గా టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుంది అంజ‌లి. ఈ అమ్మ‌డు స్టార్ హీరోల‌తో సినిమాలు చేసిన కూడా ఎందుకో కెరియ‌ర్ అంత ఆశాజ‌నకంగా లేదు. ఇటీవ‌ల వ‌కీల్ సాబ్‌లో అంజ‌లికి మంచి పాత్ర ద‌క్కింది. ఈ పాత్ర‌కిగాను అంజ‌లిపై విమ‌ర్శ‌కులు సైతం ప్ర‌శంస‌లు కురిపించారు. ప్ర‌స్తుతం ఈ భామ కేవ‌లం క‌థానాయిక‌గానే కాకుండా స‌పోర్టింగ్ పాత్ర‌ల‌లోను మెప్పిస్తుంది. అంజలి తొలిసారి షాపింగ్ మాల్ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత వరుస ఆఫర్లను సైతం అందుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ చిత్రాలలో కూడా నటించిన ఈ బొద్దుగుమ్మ‌కి త‌మిళంలో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది.
ఇప్పుడు అంజ‌లి త‌నకు వ‌చ్చిన ప్ర‌తి అవకాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇలా ఏ ఛాన్స్ వ‌చ్చిన కూడా నో చెప్ప‌డం లేదు. గ‌తంలో అంజ‌లి తన కుటుంబ స‌భ్యుల‌తో గొడ‌వ‌ప‌డ‌గా, ఆ విష‌యం ఎంత హాట్ టాపిక్ అయిందో మ‌నం చూశాం.  ఆస్తుల పంపకాల విషయంలోనే అంత‌గా గొడవలు జరిగినట్టు ఇండ‌స్ట్రీలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ విషయం కోర్టుమెట్ల వరకు వెళ్ల‌గా, ఆ త‌ర్వాత ఈ వివాదం గురించి ఎలాంటి వార్త‌లు అయితే రాలేదు. ప్ర‌స్తుతం అంజ‌లి ఆస్తులకి సంబంధించి ఓ వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.  అంజలి చేసింది తక్కువ సినిమాలు అయిన‌ప్ప‌టికీ, రెమ్యున‌రేష‌న్ కూడా త‌క్కువ తీసుకున్నా ఆస్తులు మాత్రం భారీగానే కూడ‌బెట్టింద‌ట‌.
అందాల భామ అంజలి ఆస్తులు అన్నీ కలుపుకుని… దాదాపు 200 కోట్లకు పైగా ఉన్నట్టు  ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ అమ్మ‌డికి  హైదరాబాదులోనే కాకుండా చెన్నైలో కూడా భారీగానే ఆస్తులను కూడ‌బెట్టిన‌ట్టు తెలుస్తోంది. స్టార్ హీరోయిన్లను మించి ఈ అమ్మ‌డు ఆస్తుల‌ని ఎలా సంపాదించింది అని ప‌లువురు చెవులు కొరుక్కుంటున్నారు. ఇక త‌మిళనాడు బ్యూటీ అంజ‌లి ఇప్ప‌టికే హాఫ్ సెంచరీ కొట్టింది.  త‌న కెరీర్‌లో 50  సినిమాల మైలురాయిని చేరుకుంది.ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ -శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న గేమ్ ఛేంజ‌ర్ అనే చిత్రంలో న‌టిస్తుంది. అలానే విశ్వక్ సేన్ మూవీ కూడా చేస్తుంది.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...