Home Film News NTR: టూర్ ముగించుకున్న ఎన్టీఆర్.. దేవ‌ర వేట మ‌ళ్లీ మొద‌లు కానుందా?
Film News

NTR: టూర్ ముగించుకున్న ఎన్టీఆర్.. దేవ‌ర వేట మ‌ళ్లీ మొద‌లు కానుందా?

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ స్థాయికి వెళ్లాడు.ట్రిపుల్ ఆర్ సినిమాతో ఆయ‌న క్రేజ్ గ్లోబ‌ల్ స్థాయికి చేరుకుంది. ఆర్ఆర్ఆర్ సినిమా త‌ర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్న ఎన్టీఆర్ ప్ర‌స్తుతం దేవ‌ర అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ ప్ర‌స్తుతం చిత్రీకరణ దశలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ ని విడుదల చేయగా ఇది నంద‌మూరి అభిమానులని ఎంత‌గానో అల‌రించింది. ఈ చిత్రం సముద్రం బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ యాక్షన్ రివెంజ్ డ్రామాగా కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించి రెండు షెడ్యూల్స్ పూర్తి కాగా, మరి కొద్ది రోజుల‌లో త‌దుప‌రి షెడ్యూల్ మొద‌లు పెట్ట‌నున్నారు.

త‌దుప‌రి షెడ్యూల్ ప్రారంభించడానికి ముందు ఒక చిన్న విహారయాత్రకు వెళ్లొచ్చారు ఎన్టీఆర్ ఫ్యామిలీ. భార్య లక్ష్మీ ప్రణతి, కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లను తీసుకొని గతవారం దుబాయ్‌ విహారయాత్రకు వెళ్లిన ఎన్టీఆర్ రీసెంట్‌గా హైద‌రాబాద్‌లో అడుగుపెట్టేశారు.  ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ ఫ్యామిలీ కనిపించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు త‌మ హీరో దేవ‌ర వేట మొద‌లు పెట్టేందుకు సిద్ధ‌మ‌య్యాడ‌ని అంటున్నారు. దేవ‌ర చిత్రంకి సంబంధించి ఎన్టీఆర్ లుక్ ఇప్ప‌టికే విడుద‌ల కాగా, అది చూసి ఫ్యాన్స్ మూవీపై భారీ అంచ‌నాలే పెట్టుకున్నారు.

దేవ‌ర విష‌యానికి వ‌స్తే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ అగ్ర నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించనున్నాడు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న‌ట్టు ఇప్ప‌టికే మేక‌ర్స్ అనౌన్స్ చేశారు.  ‘దేవర’ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎన్టీఆర్ వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్స్ లో ఒకేసారి పాల్గొనాల‌ని భావిస్తున్నాడు. అలా రెండు సినిమా షూటింగ్స్ ని ఒకే సమయంలో పూర్తి చేయాలని జూనియ‌ర్ అనుకుంటున్నాడ‌ట‌. ఈ సినిమాల‌లో ఒక్క సినిమా అయిన పెద్ద విజ‌యం సాధిస్తే ఎన్టీఆర్ క్రేజ్ పీక్స్ కి వెళ్ల‌డం ఖాయం.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...