Home Film News Sonu Sood: సోనూసూద్ ఏంటి ఇటుక బ‌ట్టీల‌లో ప‌ని చేస్తున్నాడు.. వ్యాపారంలో ఏమైన న‌ష్టం వ‌చ్చిందా?
Film News

Sonu Sood: సోనూసూద్ ఏంటి ఇటుక బ‌ట్టీల‌లో ప‌ని చేస్తున్నాడు.. వ్యాపారంలో ఏమైన న‌ష్టం వ‌చ్చిందా?

Sonu Sood: రీల్ విల‌న్ నుండి రియ‌ల్ హీరోగా మారిన సోనూసూద్ గురించి ఎంత చెప్పిన త‌క్కువే. క‌రోనా స‌మ‌యం నుండి అడిగిన వారికి కాద‌నకుండా సాయాలు చేసుకుంటూ వెళుతున్నాడు.ప్పటికే పలు సామాజిక కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు అందుకున్నాడు. తాజాగా జ‌రిగిన ఒడిశా రైలు ప్రమాద ఘటనపై విచారం వ్య‌క్తం చేసిన సోనూసూద్.. ఒడిశా రైలు ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలకు జీవితకాలం పెన్షన్లు లేదా స్థిరమైన నెలవారీ వేతనం చెల్లించాలే ఏర్పాట్లు చేయాల‌ని డిమాండ్ చేశారు. బాధితులకు కంటితుడుపు సహాయం కాకుండా శాశ్వత పరిహారం చూపాల‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ఆప‌ద ఎక్క‌డున్నా సోనూసూద్ అక్క‌డ ప్ర‌త్య‌క్షం అవుతుంటారు. క‌రోనా స‌మ‌యంలో కోట్లాది రూపాయలు ఖర్చుచేసి సొంత ఖ‌ర్చుల‌తో వలస కూలీలను వారివారి ప్రాంతాలకు తరలించాడు. పేద పిల్లల కోసం ఓ పౌండేషన్ ను నెలకొల్పి, వారికి ఆర్థిక సహాయం కూడా అందించిన ఘ‌నత సోనూసూద్‌ది. సోనూసూద్ చేస్తున్న మంచి ప‌నుల‌ని ఆదర్శంగా తీసుకుని పలువురు సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు వ‌స్తున్నారు.అయితే సోనూసూద్ తాజాగా త‌న సింప్లిసిటీని ప్రూవ్ చేసుకుంటూ ఏకంగా కార్మికుడి అవతారం ఎత్తి ఎండలో కష్టపడి పనిచేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

సోనూసూద్ రీసెంట్‌గా ఇటుకలు తయారు చేస్తున్న కార్మికుల దగ్గరకు వెళ్లి అక్క‌డ వారి క‌ష్టాలు అడిగి తెలుసుకున్నాడు. మండే ఎండ‌లో ఇటుకలు తయారు చేయడం ఎలానో కూడా నేర్చుకున్నాడు. అనంత‌రం సోనూయే స్వయంగా ఇటుకలు తయారు చేశాడు. ఇక ఈ తతంగం అంతా వీడియో చేసి.. తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు సోనూసూద్. దానికి క్యాప్ష‌న్‌గా .. దేశంలోని కార్మికులే దేశాన్ని బలంగా తయారు చేయ‌గ‌ల‌రు అని అన్నాడు. అయితే సోనూసూద్ సింప్లిసిటీకి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అవుతున్నారు. గ‌తంలోను అత‌ను ఇలాంటి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి ప‌లువురితో ప్ర‌శంస‌లు అందుకున్నాడు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే సోనూసూద్ ప్ర‌స్తుతం తెలుగు, హిందీ భాష‌ల‌తో పాటు ఇత‌ర భాష‌ల‌లోను న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నారు.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...