Home Film News హ్యాపీ బర్త్ డే ‘దళపతి’ విజయ్!
Film News

హ్యాపీ బర్త్ డే ‘దళపతి’ విజయ్!

Thalapathy Vijay Birthday

జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ అతని పూర్తి పేరు. తమిళనాట ఒక పెద్ద స్టార్. ఎన్నో ఏళ్లుగా అగ్ర కథానాయకుడిగా అక్కడ కోట్ల మంది అభిమానులని సంపాదించుకున్నాడు. వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ స్టార్ హీరో పుట్టిన రోజు ఈరోజు. 1974 జూన్ 22 న పుట్టిన ఆయన ఇప్పటికే దాదాపు 80 సినిమాల్లో నటించాడు. తండ్రి స్వయంగా తమిళ సినిమా దర్శకుడు కావడంతో విజయ్ కి చిన్నప్పటినుంచే సినిమాల్లో నటించే అవకాశం దొరికింది. విజువల్ కమ్యూనికేషన్ లో మంచి నైపుణ్యం సంపాదించాలి అనుకుని చెన్నై లోనే లయోలా కాలేజ్ లో డిగ్రీ కోసం ప్రయత్నించినా.. ఆ తర్వాత నటన మీద ఉన్న మక్కువతో నటుడిగా తన కెరీర్ స్టార్ట్ చేసాడు.

విజయ్ పుట్టిన రోజు సంధర్భంగా అతని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వాళ్ళ విషెస్ చూస్తే చాలు తమిళనాడులో విజయ్ స్టార్డమ్ ఇట్టే అర్థమైపోతుంది. నిన్ననే దళపతి 65 పేరుతో బీస్ట్ గా ఫస్ట్ లుక్ లో అబిమానులకి కనిపించాడు విజయ్. ప్రముఖులు కూడా విజయ్ కి తమ ట్విటర్ ఖాతాలలో పుట్టిన రోజు విషెస్ చెప్తున్నారు. ఎంతో యంగ్ గా కనిపించే విజయ్ కి ఇప్పటికే 47 ఏళ్లు.

ఈ సెలబ్రేషన్ సంధర్భంగా దళపతి 65 టీం సెకండ్ లుక్ ని కూడా రిలీజ్ చేసింది. ఇందులో విజయ్ హాండ్ గన్ తో, సిగార్ తో కనిపిస్తున్నాడు. వెనక హెలీకాప్టర్ లాండ్ అవుతూ కనిపించడం అభిమానులని ఆకర్షిస్తుంది. తలపతి అంటే కమాండర్. ఆ పదానికి సరైన అర్థం విజయ్ ఈ సినిమా ద్వారా ఇవ్వబోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...