Home Film News Balayya 108: బాల‌య్య 108వ సినిమాకి టైటిల్ ఫిక్స్.. ఇక ఊచ‌కోత‌నే..!
Film News

Balayya 108: బాల‌య్య 108వ సినిమాకి టైటిల్ ఫిక్స్.. ఇక ఊచ‌కోత‌నే..!

Balayya 108: అఖండ‌, వీర‌సింహారెడ్డి వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చిత్రాల త‌ర్వాత నంద‌మూరి బాల‌కృష్ణ అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో త‌న  108వ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. గ‌త కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. అయితే ఈ మూవీ టైటిల్‌కి సంబంధించి కొన్నాళ్లుగా అనేక వార్త‌లు వినిపిస్తుండ‌గా, ఎట్ట‌కేల‌కు మేక‌ర్స్ కొద్ది సేప‌టి క్రితం పోస్ట‌ర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ‘భగవంత్ కేసరి అనే టైటిల్ పెట్టి దానికి ‘ఐ డోంట్ కేర్’… అనేది ఉప శీర్షికగా పెట్టారు.. జూన్ 10న బాలకృష్ణ పుట్టిన రోజు కావ‌డంతో… రెండు రోజుల ముందు టైటిల్ రివీల్ చేశారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో  తెలుగు రాష్ట్రాల్లోని 108 హోర్డింగ్స్ మీద టైటిల్ పోస్టర్లు పొందుప‌రిచారు.

పోస్ట‌ర్‌లో బాలకృష్ణ లుక్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. టీజర్ ఎప్పుడు అంటూ దర్శకుడు అనిల్ రావిపూడిని, నిర్మాతలను సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ.. అడుగుతున్నారు. ఉగాది సందర్భంగా విడుదల చేసిన బాలకృష్ణ రెండు డిఫరెంట్ గెట‌ప్స్ చూసి ఫ్యాన్స్  ఫిదా అయిపోయారు. బాలకృష్ణ మునుపెన్నడూ చూడని విధంగా ఉన్నారని.. అనిల్ రావిపూడి అద్భుతంగా తమ హీరో లుక్‌ను మార్చారని ప్ర‌శంస‌లు కురిపించారు. తాజాగా విడుద‌లైన  టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌లో గతంలో లుక్‌ని మించి ఉంది నంద‌మూరి బాల‌కృష్ణ‌ మేనరిజం. ఆయన చేతిలో ఉన్న ఆయుధం కూడా డిఫరెంట్‌గా క‌నిపిస్తుంది. మోకాలి మీద కూర్చొని శత్రువులపై దాడికి సిద్ధంగా ఉన్న సింహంలా పోస్ట‌ర్‌లో క‌నిపిస్తున్నారు.

విజయ దశమి కానుకగా భ‌గ‌వంత్ కేస‌రి సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.  ఈ చిత్రంలో బాలకృష్ణకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండ‌గా, వీరిద్ద‌రి కాంబోలో ఇది తొలి చిత్రం. ఈ సినిమాలో మరో హీరోయిన్ శ్రీ లీల కూడా ఉంది.. బాలకృష్ణకు వరుసకు కుమార్తె అయ్యే పాత్రలో ఆమె నటిస్తున్న‌తెలుస్తుంది. బాలకృష్ణ సోదరుడిగా శరత్ కుమార్ నటిస్తుండ‌గా, ఆయ‌న‌ది శ్రీ లీలకు తండ్రి పాత్ర . ఇక బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ రోల్ లో క‌నిపించి అద‌ర‌గొట్ట‌నున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...