Home Film News Rana: హృతిక్, షారూఖ్‌ల‌ని చూడాల‌ని ప్రేక్ష‌కులు అనుకోవ‌డం లేదు.. రానా షాకింగ్ కామెంట్స్
Film News

Rana: హృతిక్, షారూఖ్‌ల‌ని చూడాల‌ని ప్రేక్ష‌కులు అనుకోవ‌డం లేదు.. రానా షాకింగ్ కామెంట్స్

Rana: ద‌గ్గుబాటి ఫ్యామిలీ నుండి ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రానా ఆన‌తి కాలంలో మంచి స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బాహుబ‌లి సినిమాతో రానా క్రేజ్ ప‌దింత‌లు పెరిగింది. భ‌ళ్లాలదేవుడిగా రానా త‌న న‌ట‌ విశ్వ‌రూపం  చూపించి విమ‌ర్శకుల ప్ర‌శంస‌లు అందుకున్నాడు. మ‌నోడు ఒక‌వైపు హీరోగా చేస్తూనే మ‌రోవైపు సపోర్టింగ్ రోల్స్, విల‌న్‌గా కూడా చేస్తున్నాడు. అలానే నిర్మాత‌గాను తన అదృష్టం ప‌రీక్షించుకుంటున్నాడు. రానా పెద్ద సినిమాలు కాకుండా చిన్న సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు. వాటికి ప్రమోషన్స్ కూడా త‌నే చేస్తున్నారు. రీసెంట్ గా నటుడు తిరువీర్ నటించిన ‘పరేషాన్’ మూవీకోసం ప‌లు ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఈ  క్ర‌మంలో అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పుకొచ్చారు.

ఇక తాజాగా జ‌రిగిన‌ కార్యక్రమంలో పాల్గొన్న రానా సినిమా ఇండస్ట్రీ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమలో చోటు చేసుకుంటున్న మార్పులు గురించి మాట్లాడుతూ.. “సినీ పరిశ్రమలో బాహుబలి  సినిమా అనేది ఓ అద్భుతం. ఈ చిత్రం తరువాత ప్రతి ఒక్కరిలో  సినిమా చూసే విధానం  మారింది. ఎప్పటికప్పుడు ప్రేక్షకుడు ఒక కొత్తదనాన్ని ఆశిస్తున్నాడు. దానికి తగట్టు సినిమా రంగంలో మార్పులు రావాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది. ప్రతి ఒక్కరిలో ఓ ప్రత్యేకతని కోరుకుంటున్న నేప‌థ్యంలో… కొత్తగా వచ్చే వారిలో మరో షారుక్‌ ఖాన్ , మ‌రో  హృతిక్‌ రోషన్ ని చూడాలని  ప్రేక్ష‌కులు ఏ మాత్రం అనుకోవడం లేదు. అందుకు కార‌ణం హృతిక్ అండ్ షారుఖ్ ని వాళ్ళు  ఇప్ప‌టికే చూసేశారు. మనం ఏంటనేదే వాళ్లు చూస్తున్నారు అని రానా స్ప‌ష్టం చేశారు.

ప్ర‌స్తుతం రానా చేసిన కామెంట్స్ ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఈ ఏడాది రానానాయుడు వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలుకరించిన రానా.. విరాట పర్వం తర్వాత మరే కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు.  డైరెక్టర్‌ తేజ తో మరోసారి  సినిమా చేయబోతున్నానని, రాక్షస రాజు అనే టైటిల్‌ కూడా ఫైనల్ చేశామని చెప్పేశాడు రానా . వీరిద్ద‌రి కాంబోలో  వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ క్ర‌మంలో రాక్ష‌స రాజు అనే సినిమాపై కూడా అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే తేజ రీసెంట్‌గా తెర‌కెక్కించిన అహింసా అనే  చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఘోర ప‌రాజయాన్ని చ‌వి చూసింది.

Related Articles

1000 కోట్లు ఇచ్చినా సరే అలా చేయను అంటూ తెగేసి చెప్పేస్తున్న ప్రభాస్.. ఎందుకో తెలుసా..!?

ప్రస్తుతం ఇండియన్ సినిమా చిత్ర పరిశ్రమలో భారీ స్టార్‌డంతో దూసుకుపోతున్న ప్రభాస్ పెళ్లి వయసు దాటుతున్న...

మహేష్ కోసం అవతార్ డైరెక్టర్ ను తీసుకొస్తున్న రాజమౌళి.. జక్కన్న స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా రాబోతున్నట్టు ఇప్పటికే అధికార...

రామ్ చరణ్ ఫోన్ లో ఎన్టీఆర్ నెంబర్ ఏమని ఉంటుందో తెలుసా.. భ‌లే సిల్లిగా లేదు..!

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా రామ్ చరణ్ టాలీవుడ్ లో అడుగుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా...

చిరు విశ్వంభ‌ర‌లో మెగా అభిమానులను ఎగ్జైట్ చేస్తున్న క్రేజీ న్యూస్..!

పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోల్లో హిట్, ప్లాఫ్ లతో సంబంధం...