Home Film News Omkar: ఓంకార్ అంత పేరు ప్ర‌ఖ్యాతలు సంపాదిండానికి కారణం ఏంటి?
Film News

Omkar: ఓంకార్ అంత పేరు ప్ర‌ఖ్యాతలు సంపాదిండానికి కారణం ఏంటి?

Omkar: ఓంకార్ అన్నయ్య అంటే ప్ర‌తి ఒక్క తెలుగ ప్రేక్ష‌కుడు ఇట్టే గుర్తు పడుతుంటారు. . ‘ఆట’ ఏదైనా సరే.. దాంట్లో ఎమోషన్స్ జోడించి షోని రక్తికట్టించడంలో ఓంకార్ దిట్ట అనే చెప్పాలి. ఆదిత్య మ్యూజిక్‌లో ‘అంకితం’, జీలో ఆట, మాలో ఛాలెంజ్, ఆ తరువాత వివిధ ఛానల్స్‌లో ఇస్మార్ట్ జోడీ, మాయా ద్వీపం, డాన్స్ ప్లస్, డాన్స్ ఐకాన్ అనే షోలతో బుల్లితెరపై ఓంకార్ తన మార్క్ చూపించారు. ప్రస్తుతం ఓంకార్ హోస్ట్ చేస్తున్న ‘సిక్స్త్ సెన్స్’ అనే కార్య‌క్ర‌మం చేస్తున్నాడు. ఈ షో ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. వారం వారం మంచి మంచి గెస్ట్‌లతో వినోదంతో పాటు ఎమోషన్స్‌ని పండిస్తున్న ఓంకార్ అన్నయ్య..  ప్ర‌తి వారం అలరిస్తూనే ఉంటాడు.

తాజాఎపిసొడ్‌లో ర‌స‌వ‌త్త‌ర‌మైన స‌న్నివేశం చోటు చేసుకుంది. త‌న తండ్రి చ‌నిపోమయాక ఇద్దరు తమ్ముళ్లకి అన్నీ తానై కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నారు ఓంకార్. పెద్ద తమ్ముడు అశ్విన్‌ని హీరోని చేయాలని.. చిన్న తమ్ముడు కళ్యాణ్‌ని ప్రొడ్యుసర్‌ని చేయాలనేది ఓంకార్ కోరిక ఎంత‌గానో ఉంటుంది. అన్నట్టుగానే అశ్విన్‌తో జీనియ‌స్, రాజుగారి గది 3 సినిమాలు చేసి హీరోగా గుర్తింపు ఇచ్చారు ఓంకార్. ఇక చిన్న తమ్ముడు నిర్మాణరంగంలోనే అన్న ఓంకార్‌కి తోడుగా ఉంటూ వ‌స్తున్నారు. తమ్ముళ్లంటే ఓంకార్ అన్నయ్యకి పంచ ప్రాణాలు.. తండ్రి చనిపోయిన తరువాత వాళ్లకి మంచి లైఫ్ ఇచ్చే వరకూ తెల్లబట్టల్లోనే కనిపించిన ఓంకార్ చాల క‌ష్ట‌ప‌డ్డాడు.

తమ్ముడు అశ్విన్‌ని ఎదురుగా నిలబెట్టి.. ‘నీ లైఫ్‌లో బాధని నాకు చెప్పుకోకుండా దాచిపెట్టావా? అని అడిగారు ఓంకార్. ఆ మాటతో అశ్విన్ కళ్లు చెమ్మగిల్లాయి. నా స్ట్రగుల్స్ నీతో చెప్పుకోలేదు అన్నయ్యా అనేశాడు. ‘అలా దాచిపెట్టిన ఒక్క స్ట్రగుల్ చెప్పు’ అని అడిగారు ఓంకార్. ఆ మాటతో అశ్విన్ కన్నీళ్లు ఆగలేదు.. ఏడ్చేశాడు. అది చూసిన ఓంకార్.. ‘నాన్నైనా.. అన్నైనా.. అన్నింటికీ నేనే నీకు.. అలాంటి నాకు చెప్పడానికి ఏంట్రా’ అని ఓంకార్ అడగడం.. నిజంగానే కళ్లు చెమ్మగిల్లేట్టు చేసింది.  అలా  ఓంకార్ త‌న మాట‌ల‌తో పాటు ఆట‌తో ఎంత‌గానో అల‌రించాడు

Related Articles

1000 కోట్లు ఇచ్చినా సరే అలా చేయను అంటూ తెగేసి చెప్పేస్తున్న ప్రభాస్.. ఎందుకో తెలుసా..!?

ప్రస్తుతం ఇండియన్ సినిమా చిత్ర పరిశ్రమలో భారీ స్టార్‌డంతో దూసుకుపోతున్న ప్రభాస్ పెళ్లి వయసు దాటుతున్న...

మహేష్ కోసం అవతార్ డైరెక్టర్ ను తీసుకొస్తున్న రాజమౌళి.. జక్కన్న స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా రాబోతున్నట్టు ఇప్పటికే అధికార...

రామ్ చరణ్ ఫోన్ లో ఎన్టీఆర్ నెంబర్ ఏమని ఉంటుందో తెలుసా.. భ‌లే సిల్లిగా లేదు..!

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా రామ్ చరణ్ టాలీవుడ్ లో అడుగుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా...

చిరు విశ్వంభ‌ర‌లో మెగా అభిమానులను ఎగ్జైట్ చేస్తున్న క్రేజీ న్యూస్..!

పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోల్లో హిట్, ప్లాఫ్ లతో సంబంధం...