Home Film News Chiranjeevi: బాబోయ్.. చిరు స‌ర‌స‌న ఎనిమిది మంది హీరోయిన్సా.. గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడుగా..!
Film News

Chiranjeevi: బాబోయ్.. చిరు స‌ర‌స‌న ఎనిమిది మంది హీరోయిన్సా.. గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడుగా..!

Chiranjeevi: ఈ మ‌ధ్య సీనియ‌ర్ హీరోయిన్స్ కి హీరోయిన్స్ దొర‌కడం చాలా క‌ష్టంగా మారింది. కొత్త భామ‌లనో లేదంటే ఫేడ్ ఔట్ అయిన భామ‌ల‌నో త‌మ సినిమాల‌లోకి హీరోయిన్‌గా తీసుకుంటున్నారు మ‌న సీనియ‌ర్ హీరోలు. చిరంజీవి లాంటి స్టార్ హీరో కూడా ఇటీవ‌ల హీరోయిన్స్ కోసం ఇబ్బందులు ప‌డ్డ సంద‌ర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆయ‌న ఏకంగా ఎనిమిది మంది భామ‌ల‌తో జ‌త‌క‌ట్ట‌బోతున్న‌ట్టు తెలుస్తుంది.ఈ విష‌యం ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. చిరు ఇటీవ‌ల వ‌ర‌స పెట్టి సినిమాలు చేస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. వాటిలో ఎక్కువగా రీమేక్ చిత్రాలే ఉంటున్నాయి.

ఇప్పటికే లూసీఫర్ రీమేక్ అయిన గాడ్ ఫాదర్ మూవీతో ఓ మోస్త‌రు హిట్ కొట్టిన చిరు ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం కోలీవుడ్ స్టార్ అజిత్ వేదాళం మూవీకి రీమేక్ అని కన్ఫర్మ్ అయింది. ఇందులో చిరుకు జోడీగా తమన్నా నటించనుండ‌గా, చెల్లెలుగా కీర్తి సురేష్, క‌నిపించనుంది. ఆగస్టు 11న ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా త‌ర్వాత చిరంజీవి ఏ సినిమా చేయ‌బోతున్నాడు అనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. తాజా స‌మాచారం ప్ర‌కారం నందమూరి కల్యాణ్ రామ్ కు బింబిసార వంటి సూపర్ హిట్ ఇచ్చిన వశిష్టతో సోషియో ఫాంటసీ చేయ‌నున్నాడ‌ని అంటున్నారు.

గ‌తంలో చిరంజీవి జగదేకవీరుడు అతిలోక సుందరి, యముడికి మొగడు వంటి సోషియో ఫాంటసీ సినిమాలతో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించారు. చాలా రోజుల త‌ర్వాత ఇప్పుడు విశిష్ట ద‌ర్శ‌క‌త్వంలో సోషియా ఫాంట‌సీ చేయ‌నున్నాడట‌. వశిష్ట చెప్పిన సోషియో ఫాంటసీ లైన్ మెగాస్టార్ కి న‌చ్చ‌డంతో వెంట‌నే ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని టాక్. ఇక ఈ సినిమాలో ఏకంగా 8 మంది హీరోయిన్స్ నటించనున్నారట. ఈ చిత్రం ముల్లోక వీరుడు అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జ‌ర‌పుకోనుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ‘భోళాశంకర్ చిత్రం రిలీజ్ తరువాత వశిష్ట‌ ప్రాజెక్టు పై ఒక‌ క్లారిటీ రానుందని అంటున్నారు.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...