Home Film News Heroines: అందం ఎక్కువ ఉన్నా కూడా ఈ భామ‌ల‌కి ఎందుకు త‌క్కువ అవ‌కాశాలొస్తున్నాయి..!
Film News

Heroines: అందం ఎక్కువ ఉన్నా కూడా ఈ భామ‌ల‌కి ఎందుకు త‌క్కువ అవ‌కాశాలొస్తున్నాయి..!

Heroines: ప్ర‌స్తుతం సినీ ప‌రిశ్ర‌మ‌లో హీరోయిన్స్ ప‌రిస్థితి దారుణంగా మారింది. ఎంత అందం ఉన్నా కూడా వారికి అవకాశాలు అనేవే రావ‌డం లేదు. ఒక‌ప్పుడు హీరోయిన్స్ ఎన్నో ఏళ్ల పాటు స‌త్తా చాటేవారు. కాని ఇప్పుడలా కాదు. స్టార్ డం ద‌క్కించుకున్న వారు కూడా మూడేళ్ల‌లో క‌నుమ‌రుగ‌వుతున్నారు. ఇక కొంద‌రు భామ‌ల‌కి అయితే అందం ఉన్నా కూడా అదృష్టం లేక అవ‌కాశాలు ద‌క్కించుకోలేక‌పోతున్నారు. శ్రీలీల రాకతో పూజాహెగ్డే, రష్మిక, కృతిషెట్టి లాంటి హీరోయిన్లకి గండిప‌డింది. ఎంతో అందం ఉన్న రాశీ ఖ‌న్నాకి పెద్ద‌గా అవ‌కాశాలే రావ‌డం లేదు. ఇక ఇస్మార్ట్ బ్యూటీస్ నభా నటేష్, నిధి అగర్వాల్ ప‌రిస్థితి మరీ ఘోరం. ఇస్మార్ట్ శంకర్ తర్వాత సక్సెస్ అందుకోలేకపోయిన నిధి.. హరిహర వీరమల్లు సినిమాపై గంపెడాశలు పెట్టుకుంది

నభా నటేష్‌కి ఇటీవ‌ల ఆఫ‌ర్స్ లేని కార‌ణంగా సోష‌ల్ మీడియాలో రెచ్చిపోతుంది. నివేత పెతురాజ్, మెహ్రీన్ ల‌ని అయితే దాదాపు మ‌రిచిపోయే ప‌రిస్థితి. మెహ్రీన్ ఒక‌ప్పుడు బొద్దుగా ఉండ‌గా, అవ‌కాశాల కోసం స్లిమ్ గా మారింది. తను మరింత గ్లామరస్ గా మారానని చూపించుకుంటున్నా కూడా అవ‌కాశాలు ద‌క్కించుకోలేక‌పోతుంది మెహ్రీన్. అను ఎమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్ ల కెరీర్ మ‌రింత దారుణంగా ఉంది. ఊర్వశివో రాక్షసివో సినిమాతో హిట్ కొట్టిన అను, ఆ వెంటనే రావణాసుర సినిమాతో ఫ్లాప్ చవి చూసింది. మేఘా ఆకాష్ కు కూడా రావణాసుర సినిమా దెబ్బేయ‌డంతో ప‌ట్టించునేవారే లేరు.

 

లావణ్య త్రిపాఠి, రీతూ వర్మల‌కి అందం ఉన్నా కూడా అవ‌కాశాలు క‌రువ‌య్యాయి. లావ‌ణ్య త్రిపాఠి చిన్నా చిత‌కా సినిమాలు చేస్తుండ‌గా, త్వ‌ర‌లో వ‌రుణ్ తేజ్‌ని వివాహం చేసుకోబోతుంది. పెళ్లి త‌ర్వాత అమ్మ‌డి కెరియ‌ర్ ఎలా ఉంటుందో మ‌రి. ఇక రీతూ వ‌ర్మ విష‌యానికి వ‌స్తే ‘ఒకే ఒక జీవితం’ అనే సినిమాతో మంచి హిట్ కొట్టింది. కానీ ఆ తర్వాత తెలుగు సినిమాల కంటే, తమిళ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ టాలీవుడ్ కు కాస్త దూరమైన‌ట్టు క‌నిపిస్తుంది. ఇలా ఎంతో అందం ఉన్నా కూడా ఈ భామ‌లు అవ‌కాశాలు ద‌క్కించుకోక‌పోవ‌డం వారి అభిమానుల‌ని ఆందోళ‌న‌కి గురి చేస్తుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...