Home Film News Friendship Day: ఫ్రెండ్ షిప్ డే స్పెషల్..ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ స్టాల్స్ ఎవరంటే
Film News

Friendship Day: ఫ్రెండ్ షిప్ డే స్పెషల్..ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ స్టాల్స్ ఎవరంటే

Friendship Day: సినీ ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లకు ఎంత పోటీ ఉన్నా.. వారిలో కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ ఫ్రెండ్షిప్ డే రోజు మరి వారెవరో తెలుసుకుందాం. బాపు, రమణ.. సినిమా ఇండస్ట్రీలో వీరిద్దరి కాంబినేషన్ అద్భుతం అనే చెప్పాలి. సినిమాకు ప్రాణంగా నిలిచిన మహానుభావులు. వీరిది సినిమాలో ఓ అమరమైన శకం. వీరిద్దరూ మన మధ్య లేకున్నా.. వారు తీసిన సినిమాలు ఎంతో పదిలం. రాబోయే ప్రతి తరానికి వీరిద్దరూ ఆదర్శం. నెక్ట్స్.. సినిమాలు కలిసి బంధాల్లో బెస్ట్ ఫ్రెండ్షిప్ అంటే అది సూపర్ స్టార్ రజనీకాంత్, మెహన్ బాబులదే. వీరిద్దరూ ఎన్నో దశాబ్దాలుగా స్నేహితులు. సినిమాల కోసం ఎన్నో ఏళ్లు ఒకే రూమ్ లో ఉండేవారట. సినిమా కష్టాలను పంచుకున్నారు. ఎన్నో సందర్భాల్లో వీరిద్దరి స్నేహం గురించి ప్రస్తావించిన రోజులు ఉన్నాయి.

నెక్ట్స్ త్రివిక్రమ్, సునీల్. వీరిద్దరూ మంచి స్నేహితులు.. ప్రతి కష్టంలోనూ వీరిద్దరూ తోడుగా ఉన్నారు. అందుకే త్రివిక్రమ్ ప్రతి సినిమాలోనూ సునీల్ ఉంటాడు. ఒకరికి ఒకరు ప్రాణ స్నేహితుల్లా మెలిగేవారని త్రివిక్రమ్ ఎన్నో స్టేజ్ ప్రోగ్రామ్స్ లో చెబుతారు. నెక్ట్స్ గోపిచంద్, ప్రభాస్.. సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ లో వీరూ ఒకరు. వీరి స్నేహం వర్షం మూవీతో మొదలైంది. ఎక్కడికి వెళ్లినా.. వీరిద్దరి స్నేహబంధానికి నిలువెత్తు రూపంగా ఉంటారు. వీరిద్దర్ని చూసిన ప్రతి ఒక్కరికి.. వీరిలా మనకు ఓ ఫ్రెండ్ ఉంటే బావుండు అనేలా ఉంటుంది. నెక్ట్స్ రామ్ చరణ్, రానా, శర్వానంద్.. వీరి ముగ్గురి స్నేహం ఇప్పుడు కాదు చిన్నతనం నుండి ఉంది. వీరు ముగ్గురు ఎంతో స్ట్రాంగ్ బాండింగ్ తో ఉండేవారు. నెక్ట్స్ జూనియర్ ఎన్టీఆర్, రాజీవ్ కనకాల, రాజమౌళి. వీరి ముగ్గురి ఫ్రెండ్షిప్ కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. వీరి స్నేహం స్టూడెంట్ నంబర్ వన్ నుండి స్టార్ట్ అయ్యింది.

 

కెరీర్ లో ఎంత బిజీగా ఉన్నా.. ఇప్పటికీ ఏదైనా ఈవెంట్ లో కలిస్తే చిన్నపిల్లల్లా మారిపోతారు. నెక్ట్స్ నారా రోహిత్, శ్రీ విష్ణు.. వీరు కూడా సినీ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్.. రామ్, జెనిలియా.. వీరు 2008 లో రెడీ మూవీ నుండి ఫ్రెండ్షిప్ లో స్ట్రాంగ్ అయ్యారు. ఇప్పటికీ వీరు కలిసినప్పుడు ఎంతో స్నేహంగా ఉంటారు. జెనిలీయా సోషల్ మీడియా అకౌంట్ లో యాక్టివ్ గానే ఉంటుంది. నెక్ట్స్ మంచు లక్ష్మీ, రకుల్ ప్రీత్ సింగ్ వీరు కూడా మంచి ఫ్రెండ్స్.. ఒకరి ఫ్యామిలీ ఫంక్షన్లకు మరొకరు హాజరవుతుంటారు. వీరు సోషల్ మీడియాలో కూడా తెగ ట్రెండ్ అవుతూంటారు. నెక్ట్స్ రామ్ చరణ్, ఎన్టీఆర్.. వీరిద్దరూ రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీతో బెస్ట్ ఫ్రెండ్స్ గా మారారు. రీసెంట్ గా రామ్ చరణ్ కు పాప పుట్టినప్పుడు కూడా ఎన్టీఆర్ స్పెషల్ గిఫ్ట్స్ ను పంపారు. వీరందరూ తమ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. ఫ్రెండ్షిప్ కు మాత్రం మంచి బాండింగ్ ను ఇస్తుంటారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...