Home Film News Heroines: ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాక ఎంత మంది పేర్లు మార్చుకున్నారో తెలుసా?
Film News

Heroines: ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాక ఎంత మంది పేర్లు మార్చుకున్నారో తెలుసా?

Heroines: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లకు ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఇక సినిమాల్లో పాత్రలతో వారి హావభావాలు, అందం అభినయంతో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకుంటారు. అలాంటి తమ అభిమాన నటీనటుల పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి కూడా అభిమానులు స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలా హీరోయిన్లు సినీ ఇండస్ట్రీ రాకముందు ఒక పేరుతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక.. పరిస్థితుల కారణంతో మరో పేరుతో చలామణి అవుతుంటారు. అలా కొంతమంది హీరోయిన్లు న్యూమరాలజీ ప్రకారం అదృష్టం కోసం పేరు మార్చితే.. మరికొంతమంది పేర్లను డైరెక్టర్ మారుస్తూ ఉంటారు. మరి అలా సినీ ఇండస్ట్రీకి వచ్చాక పేర్లు మార్చుకున్న హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం.

టాలీవుడ్ లో సహజనటిగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ జయసుధ అసలు పేరు సుజాత. ఆమె ఇండస్ట్రీలోకి వచ్చాక డైరెక్టర్ దాసరి నారాయణ రావు సుజాత పేరును జయసుధగా మార్చారు. నెక్ట్స్ జయప్రద. ఆమె అసలు పేరు లలితా రాణి. సినిమాల్లోకి వచ్చాక పేరు మార్చుకున్నారు. అందానికి కేరాఫ్ అడ్రస్ అంటే సౌందర్యనే అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అలా సౌందర్య అసలు పేరు సౌమ్య. ఆమె పేరు కూడా సినిమాల్లోకి వచ్చాక మార్చుకున్నారు. నెక్ట్స్ ఒకప్పటి హీరోయిన్ గా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని ఏలి.. ప్రజంట్ ఏపీ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు నటి రోజా.

ఆమె అసలు పేరు శ్రీలతా రెడ్డి. ఆమె సినిమాకి వచ్చాక సీనియర్ నటుడు శివప్రసాద్.. రోజా అని పేరు మార్చారు. ఇక హీరోయిన్ రంభ అసలు పేరు విజయలక్ష్మి.. సినిమాల్లోకి వచ్చాక రంభగా మార్చారు. ఇక ప్రజంట్ టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న అనుష్క శెట్టి అసలు పేరు స్వీటీ శెట్టి. ఆమె ఫస్ట్ మూవీ సూపర్ సినిమాలో షూటింగ్ టైమ్ లో హీరో నాగార్జున ఆమెకు అనుష్క అని పేరు పెట్టారు. అలా ఎంతోమంది హీరోయిన్ల ఒరిజినల్ పేర్ల కంటే సినిమాల్లోకి వచ్చిన తర్వాత పేర్లతోనే తమ కెరీర్ లో మంచి పేరు తెచ్చుకున్నారు.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...