Home Film News Regina: మూవీ ఛాన్స్ అడిగితే.. ఆ ప‌నికి ఓకే అంటే ఇస్తామ‌న్నారు.. రెజీనా షాకింగ్ కామెంట్స్
Film News

Regina: మూవీ ఛాన్స్ అడిగితే.. ఆ ప‌నికి ఓకే అంటే ఇస్తామ‌న్నారు.. రెజీనా షాకింగ్ కామెంట్స్

Regina: ఇటీవ‌లి కాలంలో కాస్టింగ్ కౌచ్ అనే పేరు బాగా వినిపిస్తుంది. సౌత్, నార్త్ అనే కాకుండా హాలీవుడ్‌లోను కాస్టింగ్ కౌచ్ వివాదం ఎక్కువ‌గా న‌డుస్తుంది. ఈ క్ర‌మంలోనే మీటూ ఉద్య‌మం మొద‌లు కాగా, ఈ ఉద్యమం త‌ర్వాత చాలా మంది న‌టీమ‌ణులు త‌మ‌కు ఎదురైన అనుభ‌వాల గురించి మీడియా ముందు ఓపెన్ గా చెప్పేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లోకి అందాల భామ రెజీనా కూడా చేర‌గా, తన‌కు ఎదురైన అనుభ‌వాల గురించి తాజాగా చెప్పుకొచ్చి హాట్ టాపిక్ అయింది .  తమిళ బ్యూటీ అయిన‌ రెజీనా కసాండ్రా తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా సుప‌రిచితం. టాలీవుడ్‌లో ఎంతో మంది యువ హీరోల స‌ర‌స‌న న‌టించి మెప్పించింది .

తెలుగులో చాలా సినిమాల‌నే చేసిన కూడా ఈ అమ్మ‌డికి పెద్ద హిట్స్ రాక‌పోవ‌డంతో ఇప్పుడు అవ‌కాశాలు క‌రువ‌య్యాయి. దీంతో త‌మిళంలోనే చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది.  తాజాగా ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన  రెజీనా .. తాను  కూడా కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నట్టు పేర్కొంది.2005లో త‌న కెరీర్ మొద‌లు కాగా, అప్పుడు అవ‌కాశాల కోసం ప‌లువురిని క‌లిసాను. అప్పుడు ఒక‌రు ఫోన్ చేసి సినిమా అవ‌కాశం ఇస్తామ‌న్నారు.  కాక‌పోతే  అడ్జస్ట్ మెంట్ కు ఓకే అంటే  తర్వాత షూటింగ్ పని చూసుకోవచ్చని  చెప్పుకొచ్చారు. ఆ స‌మ‌యంలో  నాకు అతని మాటలు అర్థం కాలేదు. అయితే  అడ్జస్ట్ మెంట్ అంటే నేను ఏదో రెమ్యునరేషన్ విషయం మాట్లాడుతున్నారేమో అనుకొని, నా మేనేజర్ మీతో మాట్లాడుతాడని ఫోన్ కట్ చేశాను.

కాని త‌ర్వాత నా మేనేజ‌ర్ అస‌లు విష‌యం అర్ధమ‌య్యేలా చెప్పాడు. అయితే ఇది జ‌రిగి పదేళ్ల‌కి పైగా అయింది. అప్పుడు నా వ‌య‌స్సు  20 ఏళ్లు ఉంటుంది అని రెజీనా పేర్కొంది. అయితే  ఇటీవ‌ల చాలా మంది కాస్టింగ్ కౌచ్ గురించి ప‌లు వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల‌లో నిలుస్తున్నారు. కొంద‌రు నిజంగానే త‌మ జీవితంలో జ‌రిగిన విష‌యాల గురించి చెబుతుండ‌గా, మ‌రి కొంద‌రు ఫేమ్ కోసం కాస్టింగ్ కౌచ్‌ని వాడుకుంటున్నారు. ఏదేమైన ప్ర‌స్తుతం రెజీనా చేసిన కామెంట్స్ ఇటు కోలీవుడ్, అటు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...