Home Film News Samantha Remuneration: సంచ‌ల‌నంగా మారిన స‌మంత రెమ్యున‌రేష‌న్.. ఆ వెబ్ సిరీస్ కోసం అంత పుచ్చుకుందా?
Film News

Samantha Remuneration: సంచ‌ల‌నంగా మారిన స‌మంత రెమ్యున‌రేష‌న్.. ఆ వెబ్ సిరీస్ కోసం అంత పుచ్చుకుందా?

Samantha Remuneration: టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న అందాల ముద్దుగుమ్మ స‌మంత‌.ఈ అమ్మ‌డు ఆ మ‌ధ్య అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో చాలా ఇబ్బంది ప‌డింది. ఇప్పుడు పూర్తిగా కోలుకోవ‌డంతో వ‌రుస పెట్టి సినిమాలు చేస్తుంది. స‌మంత న‌టించిన‌ `యశోద` చిత్రం కాస్త ప‌ర్వాలేదనిపించింది. కానీ `శాకుంతలం` మాత్రం అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇది స‌మంత‌కి  పెద్ద దెబ్బ అనే చెప్పాలి. అయితే శాకుంతలం అంత దారుణంగా ఫ్లాప్ అయిన‌ప్ప‌టికీ ఆమెకు భారీ ఆఫ‌ర్సే వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం స‌మంత‌ తెలుగులో `ఖుషీ` చిత్రం చేస్తుంది. హిందీలో హాలీవుడ్‌ రీమేక్‌ `సిటాడెల్‌` అనే వెబ్ సిరీస్‌లో నటిస్తుంది.  ఈ వెబ్ సిరీస్‌లో న‌టించేందుకు ఇటీవ‌ల విదేశాల‌కి కూడా వెళ్లొచ్చింది ఈ ముద్దుగుమ్మ‌.

సిటాడెల్ వెబ్ సిరీస్‌కి సమంత అందుకున్న పారితోషికం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కేవ‌లం ఈ ఒక్క వెబ్‌ సిరీస్‌కిగానూ సమంత ఏకంగా పది కోట్ల పారితోషికం అందుకుంటున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. స‌మంత  తన కెరీర్‌లో ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో పారితోషికం అందుకోలేద‌ట‌. మేక‌ర్స్  అంత భారీ మొత్తం ఆఫ‌ర్ చేశారు కాబ‌ట్టే సమంత ఇందులో నటించేందుకు ఒప్పుకుందట.ఈ వెబ్ సిరీస్‌లో యాక్షన్ స‌న్నివేశాల‌తో పాటు రొమాంటిక్‌ సన్నివేశాల్లోనూ నటించేందుకు సిద్ధపడిందని అంటున్నారు. ఈ వార్త క‌నుక‌ నిజమైతే సౌత్‌లో ఇంతటి పారితోషికం అందుకున్న తొలి హీరోయిన్‌గా రికార్డుల్లోకి ఎక్కుతుంది.

స‌మంత చివ‌రిగా `ది ఫ్యామిలీ మ్యాన్ 2` అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఇందులో రాజీ అనే పాత్ర‌తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. కొన్ని బోల్డ్ సీన్లలోనూ నటించి అదుర్స్ అనిపించింది. స‌మంత  ది ఫ్యామిలీ మ్యాన్ 2  వెబ్‌ సిరీస్‌తోనే నార్త్ ఆడియెన్స్ కి  చాలా దగ్గరయ్యింది. స‌మంత‌కి హాలీవుడ్‌ నుంచి ఆఫర్లు వస్తున్నాయంటే ఈ వెబ్‌ సిరీస్‌ పాత్ర చాలా కీలకమని చెప్పొచ్చు. త్వరలోనే ఆమె ఓ హాలీవుడ్‌ మూవీలో కూడా న‌టించ‌బోతుంది. ఈ  చిత్రంతో స‌మంత రేంజ్ మ‌రో లెవ‌ల్‌కి వెళుతుంది. ప‌ర్స‌న‌ల్ లైఫ్ కాస్త డిస్ట్రబ్ అయిన ప్రోఫెష‌న‌ల్ లైఫ్‌లో దూసుకుపోతుంది స‌మంత‌.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...