Home Film News ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను హాట్ చేసిన రాజమౌళి తండ్రి… త్రిబుల్ ఆర్ పై అలాంటి వ్యాఖ్యలా..!?
Film News

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను హాట్ చేసిన రాజమౌళి తండ్రి… త్రిబుల్ ఆర్ పై అలాంటి వ్యాఖ్యలా..!?

బాహుబలి సినిమాల తర్వాత దర్శకధీరుడు రాజమౌళి 2022లో త్రిబుల్‌ ఆర్ సినిమాతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని పెంచింది. అదే విధంగా ఈ సినిమాకు ఆస్కార్ అవార్డుతో పాటు పలు అంతర్జాతీయ బహుమతులు కూడా వచ్చాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆలియా భ‌ట్ ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటికీ ఎన్నో రికార్డులను తిరగరాస్తుంది. అలాగే ఈ సినిమాలో నటించిన నటీనటులకు కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది.

RRR 2 Is Happening & SS Rajamouli Confirms Positive Developments On It: "I Can't Reveal Many Details About It But..."

త్రిబుల్ ఆర్ సినిమా కలక్షన్స్ విషయంలో కూడా భారీ రికార్డులను తిరగరాసింది. అదేవిధంగా ఈ సినిమాలో హీరోలుగా నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ నటనపై ఇప్పటికీ ప్రశంస‌లు వస్తూనే ఉన్నాయి. ఈ సినిమా విడుదలైన సమయంలో వీరిద్దరి నటనపై ఫ్యాన్స్ మ‌ధ్య వార్‌ కూడా జరిగింది. ఇప్పుడు తాజాగా విజయేంద్ర ప్రసాద్ పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయంపై మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను హట్‌ చేశాడు.

SS Rajamouli's father and screenwriter Vijayendra Prasad to direct film on RSS soon: 'RSS has made one mistake...' | Entertainment News, Times Now

రామ్ చరణ్- ఎన్టీఆర్ క్యారెక్టర్ లో ఎక్కువ కాలం గుర్తుండిపోయేది ఏది అంటే మీరు ఓపెన్గా చరణ్ అన్నారు అని ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడగగా.. ఆ విషయానికి విజయేంద్ర ప్రసాద్ అలాంటిది ఏమీ ఉండదు అని అన్నాడు. యాంకర్ మళ్లీ అదే ప్రశ్న వేయడంతో కాస్త త‌డబడుతూ ఈ సినిమా స్టోరీ రాసేటప్పుడు అలా ఏమనుకోలేదు.. అసలు ఒక పాత్రను తక్కువ చేయటం అనేది మాకు ఉండదు. అసలు అలా అనుకోం రాసేటప్పుడు మాకు రెండు పాత్రలు ఒకేలా అనిపించాయి.

RRR review: SS Rajamouli film is a visual treat that takes several creative liberties

ఒకేలా అనుకునే కథ రాశాం.. అయితే రామ్ చరణ్ పాత్రలో ఎక్కువ వేరియేషన్స్ ఉంటాయి.. ఎన్టీఆర్ పాత్రలో అమాయకత్వం ఉంటుంది… అయితే ఎన్టీఆర్ చేసిన బిమ్‌ పాత్ర చేయడం చాలా కష్టం.. ఈ కథను ముందుకు తీసుకు వెళ్ళటంలో సపోర్టింగ్ గా ఉంటుంది రామ్ చరణ్ ని అల్లూరి సీతారామరాజుగా చూపిస్తే.. చాలామంది రాముడు వచ్చాడని అనుకున్నారు మేం ఆ ఉద్దేశంతో తీయలేదు అంటూ చెప్పుకోచ్చారు. ఒక రైటర్‌గా తన అభిప్రాయం ఏంటో చెప్పారు విజయేంద్ర ప్రసాద్. కానీ ఈ వ్యాఖ్యలు చాలావరకు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు నచ్చలేదు.

Jr NTR's intense look as Komaram Bheem in RRR to be unveiled on his birthday - India Today

త్రిబుల్‌ ఆర్’లో ఎన్టీఆర్ పాత్ర గురించి, ఆయ‌న‌ నటన గురించి ఆయన గొప్పగానే మాట్లాడినా కూడా పాత్రల ప్రాముఖ్యత విషయంలో మాత్రం రామ్ చరణ్‌కే కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఉంది అన్నట్టుగా ఆయన ఒప్పుకున్నారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అయితే దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దీన్ని చూసిన నెటిజ‌న్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...