Home Film News నాగార్జున హీరోగా వచ్చిన సినిమాకు.. డైలాగ్ కింగ్‌ సాయికుమార్ డబ్బింగ్ చెప్పిన సినిమా ఏమిటో తెలుసా..!
Film NewsSpecial Looks

నాగార్జున హీరోగా వచ్చిన సినిమాకు.. డైలాగ్ కింగ్‌ సాయికుమార్ డబ్బింగ్ చెప్పిన సినిమా ఏమిటో తెలుసా..!

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రయోగాలకు పెట్టింది పేరు నాగార్జున.. కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ ఎన్నో కొత్త స్టోరీలతో ఎన్నో సినిమాలు టాలీవుడ్‌కు అందించీ ట్రెండ్ సెట్టర్గా మలిచాడు. అదేవిధంగా బాలీవుడ్ లో కూడా సినిమాలు చేసి విజయాలు అందుకున్న అతి తక్కువ మంది తెలుగు హీరోలలో నాగార్జున కూడా ఒకరు.

అలాంటి నాగార్జున హిందీలో బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్, శ్రీదేవి నాగార్జున కాంబినేషన్లో 1992లో రిలీజ్ అయిన బాలీవుడ్ సినిమా ఖుదా గ‌వా ఈ సినిమా ఆ రోజుల్లోనే మంచి బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. పీరియాటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లోనే దాదాపు రూ.8 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. రూ.15 కోట్లకు పైగా భారీ కలెక్షన్ రాబట్టింది.

ఈ సినిమాలో అమితాబ్ బాద్‌షా ఖాన్ అనే పాత్రలో నటించగా నాగార్జున రాజా మీర్జా అనే పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. శ్రీదేవిడ్యూయల్ రోల్ లో నటించింది. ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ఖుదా గ‌వాలో షూటింగ్ చేశారు. బాలీవుడ్‌లో హిట్ అయ‌న ఈ మూవీని తెలుగులో కొండ‌వీటి సింహం పేరుతో డ‌బ్ చేశారు. కాగా ఈ సినిమాలో నాగార్జున పాత్ర‌కు సాయికుమార్ డ‌బ్బింగ్ చెప్ప‌డం గ‌మ‌నార్హం. నాగార్జున సినిమాల్లో అత‌డి ఓన్ వాయిస్ కాకుండా మ‌రొక‌రి గొంతు వినిపించే ఏకైక తెలుగు సినిమా కొండ‌వీటి సింహం కావ‌డం గ‌మ‌నార్హం. ఖుదా గ‌వాలోనే తొలిసారి అమితాబ్ బ‌చ్చ‌న్‌తో క‌లిసి న‌టించారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...