Home Film News Janhvi Kapoor: తెలుగు హీరోతో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్న జాన్వీ.. త్వ‌ర‌లో అనౌన్స్‌మెంట్
Film News

Janhvi Kapoor: తెలుగు హీరోతో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్న జాన్వీ.. త్వ‌ర‌లో అనౌన్స్‌మెంట్

Janhvi Kapoor: అతిలోక సుంద‌రి శ్రీదేవి అందాల త‌న‌య జాన్వీ క‌పూర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. త‌ల్లి వార‌స‌త్వంతో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుంది. జాన్వీకి పెద్దగా స‌క్సెస్‌లు రాక‌పోయిన వ‌రుస అవ‌కాశాలు ద‌క్కించుకుంటూ అద‌ర‌హో అనిపిస్తుంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చేసే ర‌చ్చ పీక్స్ లో ఉంటుంది. మ‌రాఠీ మూవీ రీమేక్ తో వెండితెర డెబ్యూ ఇచ్చిన జాన్వీ క‌పూర్ ఈ సినిమాతో ఒక్క‌సారి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఆ త‌ర్వాత గుంజాన్‌ సక్సేనా: ద కార్గిల్‌ గర్ల్‌’ అనే బయోపిక్ సినిమాల‌లో న‌టించి త‌న న‌ట‌న‌తో మెప్పించింది. జాన్వీ క‌పూర్..గ్లామర్బాటలో కాకుండా నటనకు ప్రాధాన్యత గల సినిమాలు కూడా చేస్తుంది.

అందుకు ఉదాహ‌ర‌ణ‌గా  గుడ్లక్ జెర్రీ, మిలి చిత్రాలు చెప్ప‌వ‌చ్చు. వీటిలో ఆమె తన న‌ట విశ్వ‌రూపం చూపించింది. ఇక త్వ‌ర‌లో జాన్వీ  క్రికెటర్ గా కూడా  కనిపించనున్నట్లు సమాచారం. అయితే జాన్వీ క‌పూర్ ఇటీవల ప్రేమాయ‌ణంతో ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తుంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియా  తో కలిసి జాన్వీప్రేమలో ఉంద‌ని అప్ప‌ట్లో బాగా వార్త‌లు వ‌చ్చాయి. ఆ  తరువాత బ్రేకప్ అయ్యిందని బి-టౌన్ లో బాగా ప్ర‌చారం జ‌రిగింది.. ఇక ఇప్పుడు ఓ తెలుగు హీరోతో ప్రేమ‌లో ఉంద‌ని,త్వ‌ర‌లో ఆ హీరోతో క‌లిసి ప‌ని చేయ‌బోతుంద‌ని ప్ర‌చారం న‌డుస్తుంది.

అన్ని కుదిరితే వారి ప్రేమ విష‌యం త్వ‌ర‌లోనే రివీల్ చేసే అవ‌కాశం కూడా ఉంద‌ని అంటున్నారు. ఇక జాన్వీ ప్ర‌స్తుతం తెలుగులో ఎన్టీఆర్‌తో క‌లిసి దేవ‌ర అనే సినిమా చేస్తుంది.ఈ చిత్రం జాన్వీ డెబ్యూ మూవీ.  తన తల్లి శ్రీదేవిలా సౌత్ లోకూడా  స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకొనే ప్రయత్నం దేవ‌ర‌తో చేస్తుంది జాన్వీ క‌పూర్.  ఇందులో ఎన్టీఆర్ హీరోగా న‌టించ‌డం, ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తరువాత ఎన్టీఆర్  చేస్తున్న సినిమా కావడం, కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని  కళ్యాణ్ రామ్ నిర్మిస్తుండ‌గా,  ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...