Home Film News Pawan Memories: నీర‌క్ష‌ణికి తెర‌దించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. మ‌న బంధం ఇలానే కొన‌సాగాలి..
Film News

Pawan Memories: నీర‌క్ష‌ణికి తెర‌దించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. మ‌న బంధం ఇలానే కొన‌సాగాలి..

Pawan Memories: ఈ రోజుల్లో ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో సోష‌ల్ మీడియా ఒక భాగం అయింది.ఇక సెల‌బ్రిటీల సంగ‌తైతే చెప్ప‌న‌క్క‌ర్లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తమ ప‌ర్స‌న‌ల్, ప్రొఫెష‌న‌ల్ విష‌యాలు షేర్ చేసుకుంటూ నెటిజ‌న్స్‌ని అల‌రిస్తున్నారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యానికి వ‌స్తే ఆయన ఇన్నాళ్లు ట్విట్ట‌ర్‌లోనే యాక్టివ్‌గా ఉండే వారు. కాని రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. జ‌న‌సేనాని రాజ‌కీయాల‌లో దూకుడు పెంచిన నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క అవ‌కాశాన్ని వినియోగించుకొని ఈ సారి ఎలాగైన త‌న స‌త్తా చాటాల‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఇన్‌స్టాలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు.

నిన్న‌టి వ‌ర‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇన్‌స్టాలో ఒక్క పోస్ట్ పెట్ట‌క‌పోయిన కూడా ఆయ‌న‌ని 2.4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. సినిమాల‌తోనే కాదు సోష‌ల్ మీడియాలోను ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌భంజనం సృష్టించారు. ఇక ఆయ‌న  ఇన్‌స్టాగ్రామ్ లో ఎటువంటి పోస్టులు పెడతారు అని అంద‌రు ఎంతో  ఆసక్తిగా ఎదురు చూసారు.. ఆయన పెట్టే మొదటి పోస్టు సినిమాల‌కి సంబంధించి ఉంటుందా, రాజ‌కీయాల‌కి సంబంధించి ఉంటుందా అని చాలా మందిలో క్యూరియాసిటీ ఉండేది. దానికి తెర‌దించారు.  జూలై 15వ తేదీన సాయంత్రం  తొలి ఇన్‌స్టా పోస్ట్ పెట్టారు.  ఈ పోస్ట్  గొప్ప వారితో కలిసి పవన్ కళ్యాణ్ సినిమాలలో సాగిస్తున్న ప్రయాణంకి సంబంధించిందిగా ఉంది.

త‌న ఇన్‌స్టాలో ఒక వీడియో ని షేర్ చేసిన పవన్ కళ్యాణ్ మన బంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలి. మరెన్నో మధురమైన జ్ఞాపకాలను పంచుకోవాలని ఆశిస్తున్నాను అంటూ ఇండ‌స్ట్రీలోని  ప్రముఖ నటులతో కలిసి ఉన్న ఫోటోలను కలిపి ఒక వీడియోగా చేసి దానిని త‌న ఇన్‌స్టాలో పెట్టారు. ఈ వీడియోకి అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తుంది.తొలి పోస్ట్‌లో తాను ఎలాంటి రాజ‌కీయాలకి తావివ్వ‌కుండా పోస్ట్ పెట్ట‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. బిగ్ బి అమితాబ్ బచ్చన్, మెగాస్టార్ చిరంజీవి , నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, బాలకృష్ణ హీరోలతో పాటు విశ్వనాథ్, దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు వంటి దర్శకులతో ప‌వ‌న్ క‌లిసి ఉన్న ఫొటోలు కూడా ఈ వీడియోలో భాగం అయ్యాయి.

Related Articles

దివంగత శ్రీదేవికి.. ఎన్టీఆర్ దేవర సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? కొరటాల స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర.. పాన్ ఇండియా...

అది నాకు ఎప్పుడో తెలుసు.. నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి గురించి సమంత హాట్‌ కామెంట్స్..!

ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో ఎంతో వైరల్ గా మారింది. ఇన్ని రోజులు ఎంతో...

బిగ్ బ్రేకింగ్: “షణ్ముఖ్” కేసులో బయటపడ్డ కొత్త కోణం.. అన్నిటికీ కారణం “యాంకరే” నా..?

షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు గురించి అందరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్లో వచ్చిన...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...