Home Film News Chiranjeevi: బేబి హీరోయిన్‌ని స‌హ‌జ న‌టితో పోల్చిన చిరంజీవి.. సన్మాన స‌భ‌కి వ‌చ్చిన‌ట్టుంద‌ని కామెంట్
Film News

Chiranjeevi: బేబి హీరోయిన్‌ని స‌హ‌జ న‌టితో పోల్చిన చిరంజీవి.. సన్మాన స‌భ‌కి వ‌చ్చిన‌ట్టుంద‌ని కామెంట్

Chiranjeevi: ఇటీవ‌ల చిన్న సినిమాగా విడుద‌లై పెద్ద విజ‌యం సాధించిన చిత్రం బేబి. మూవీ సాధించిన భారీ విజ‌యానికి చిత్ర బృందం వ‌రుస సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకుంటుంది. గ‌త రాత్రి  మెగా కల్ట్ సెలెబ్రేషన్స్ పేరుతో సక్సెస్ ఈవెంట్ నిర్వహించ‌గా, ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు  అయ్యారు. దీంతో ఈ మూవీకి మ‌రింత హైప్ వ‌చ్చింది. చిత్రంలో  ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ప్రధాన పాత్ర‌లు పోషించగా, వీరికి క్రిటిక్స్ నుంచి ప్రశంసలు ద‌క్కాయి.తాజాగా చిరంజీవి సైతం  బేబీ చిత్ర దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత ఎస్ కె ఎన్ చిరంజీవితో పాటు న‌టీన‌టుల‌పై పై ప్రశంసలు కురిపించారు.

ఈ హంగామా చూస్తుంటే ఇది బేబీ సక్సెస్ వేడుకా లేక తన సన్మాన సభా అని చమత్కరించారు మెగాస్టార్ . ప్ర‌స్తుతం నేను పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నా, మ‌రోవైపు తోడబుట్టిన తమ్ముళ్లు విజయం సాధిస్తే ఎలాంటి ఉత్సాహం ఉంటుందో అది కూడా చూశా. ఇక ఇప్పుడు నాకు దేవుడిచ్చిన తమ్ముళ్లు,  నా అభిమానులు విజయం సాధిస్తే ఆ ఉత్సాహం ఎలా ఉంటుందో కూడా చూశాను. దానిని మాట‌ల‌లో చెప్ప‌లేను. ఎస్ కె ఎన్, సాయి రాజేష్ లు సినిమాలు చూడ‌డం ద‌గ్గ‌రే ఆగిపోకుండా క‌ష్ట‌ప‌డి  ఈ స్థాయికి చేరుకున్నారు. అందుకే వారి విజ‌యోత్స‌వ వేడుక‌లో నేను భాగం అయ్యేందుకు వ‌చ్చాను.

హృద‌య కాలేయం వంటి కామెడీ చిత్రాలు తెరకెక్కించిన సాయి రాజేష్..  అక్క‌డితో  ఆగిపోకుండా త‌న‌ పూర్తి స్థాయి ప్రతిభ చూపాడు. విజయ్ దేవరకొండ సోద‌రుడు ఆనంద్ దేవరకొండ నటించిన ఓ చిత్రం చూశాను. అత‌ని న‌ట‌న‌లో మెచ్యూరిటీ కనిపించింది.  హీరోయిన్ వీడియో చూసే సీన్ లో అతడి నటన హృద‌యాన్ని ట‌చ్ చేస్తుంది. ఇక వైష్ణ‌వి చాలా వేరియేషన్స్ ,చూపించింది.  సహజ నటి జయసుధ తర్వాత అంత నేచురల్ గా నటించే నటి నాకు ఇంత‌వ‌ర‌కు  కనిపించలేదు. వైష్ణవిలో ఆ లక్షణాలు ఉన్నాయి అంటూ చిరు ఆమెపై ప్రశంసల వ‌ర్షం కురిపించారు. ఇక విరాజ్ నటనని కూడా చిరు ప్ర‌శంసించారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...