Home Film News Rerelease Movies: రీరిలీజ్ సినిమాల సంద‌డి.. ఈ వారంలో ఏయే స్టార్ హీరోల సినిమా విడుద‌ల కానున్నాయంటే..!
Film News

Rerelease Movies: రీరిలీజ్ సినిమాల సంద‌డి.. ఈ వారంలో ఏయే స్టార్ హీరోల సినిమా విడుద‌ల కానున్నాయంటే..!

Rerelease Movies: ఇప్పుడ సినిమా ఇండ‌స్ట్రీలో స‌రికొత్త ట్రెండ్ న‌డుస్తుంది. ఎవ‌రైన స్టార్ హీరోల బ‌ర్త్ డే వ‌స్తుంది అంటే వారి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయా హీరోల సినిమాల‌ని రీరిలీజ్ చేస్తూ ర‌చ్చ చేస్తున్నారు. అయితే రీరిలీజ్ స‌మ‌యంలో కూడా థియేట‌ర్‌కి జ‌నాలు పోటెత్తుతున్న నేప‌థ్యంలో ఈ ట్రెండ్ కొన‌సాగుతూనే ఉంది. టాలీవుడ్  పర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాతో ఈ ట్రెండ్ మొద‌లు కాగా, ఈ సినిమా రీరిలీజ్ స‌మ‌యంలో  చిత్రానికి దిమ్మతిరిగే కలెక్షన్స్ వ‌చ్చాయి. ఇక‌ ఆ కలెక్షన్స్ కు పోటీ పడేలా ఇతర హీరోల సినిమాలు కూడా రీ రిలీజ్ అయ్యాయి.

ఇక పోకిరి త‌ర్వాత ఇత‌ర హీరోల సినిమాలు కూడా రీరిలీజ్ అవుతున్నాయి.  పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ఇలా స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అవుతూ ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచుతున్నాయి. ఇక ఈ వారం కూడా రీ రిలీజ్ సంద‌డి కనిపించ‌బోతుంది. ఇప్ప‌టికే కొన్ని సినిమాలు రీరిలీజ్‌కి రెడీగా ఉండ‌గా, మ‌రి కొన్ని సినిమాలు విడుద‌ల‌కి సిద్ద‌మ‌య్యాయి. ఈ వారంలో   మహేష్ బాబుతో పాటు సూర్య సినిమా కూడా రీ రిలీజ్ కు రెడీ అవుతుండ‌గా, వాటి  కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన  సూప‌ర్ హిట్ చిత్రాల‌లో  బిజినెస్ మ్యాన్ ఒకటి. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది.

బిజినెస్ మ్యాన్ చిత్రంలో  పూరి మార్క్ డైలాగ్స్, మహేష్ బాబు యాక్టింగ్ హైలైట్ నిలిచాయి. ఆగ‌స్ట్ 9న మ‌హేష్ బాబు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మూవీని రీరిలీజ్ చేయ‌బోతున్నారు. ఇక  తమిళ్ స్టార్ హీరో సూర్యకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది.ఆయ‌న న‌టించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా తెలుగు, త‌మిళంలో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.  గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన  సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా, ఇప్పుడు ఈ చిత్రం  ఆగస్టు 4( ఈ రోజు) రీ రిలీజ్ కాబోతుంది. చిత్రానికి  హారిస్ జయరాజ్ అందించ‌గా, ఇందులోని పాట‌ల‌న్నీ సంగీత ప్రియుల‌కి ఎంతో వినోదాన్ని పంచాయి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...